Telugu Global
Andhra Pradesh

అసంతృప్తి ఆనంకి జ‌గ‌న్ మార్క్ ఝ‌ల‌క్‌.. వెంక‌ట‌గిరి వైసీపీ ఇన్‌చార్జిగా రామ్‌కుమార్‌రెడ్డి..?

కొంతకాలంగా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆనం రాంనారాయ‌ణ‌రెడ్డి మంగ‌ళ‌వారం కూడా వైసీపీ స‌ర్కారుపై విరుచుప‌డ్డారు.

అసంతృప్తి ఆనంకి జ‌గ‌న్ మార్క్ ఝ‌ల‌క్‌.. వెంక‌ట‌గిరి వైసీపీ ఇన్‌చార్జిగా రామ్‌కుమార్‌రెడ్డి..?
X

నెల్లూరు జిల్లాలో నిత్య అసంతృప్తివాదిగా ముద్ర‌ప‌డిన వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి సీఎం జ‌గ‌న్ మార్క్ ఝ‌ల‌క్ ఇవ్వ‌నున్నారు. రోజూ స‌మ‌యం సంద‌ర్భం లేకుండా మీడియా ముందుకొచ్చి ఆరోప‌ణ‌లు చేస్తున్న ఆనంకి వైసీపీ అధిష్టానం త‌మ నిర్ణ‌యంతో షాక్ ఇవ్వ‌నుంది. వెంకటగిరి నియోజకవర్గ ఇన్చార్జిగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని ప్రకటించనుంది.

కొంతకాలంగా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆనం రాంనారాయ‌ణ‌రెడ్డి మంగ‌ళ‌వారం కూడా వైసీపీ స‌ర్కారుపై విరుచుప‌డ్డారు. నాలుగేళ్ల పాలనలో ఏమి చేశామని మళ్లీ ప్రజలను ఓట్లు ఎలా అడుగుతామని ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే ఆనం.. ముందస్తు ఎన్నికలకు వెళితే ఇంటికి వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. ఇంకా ఉపేక్షించి లాభం లేదు అనుకున్న వైసీపీ అధిష్టానం ఆనంకి చెక్ పెట్టే నిర్ణ‌యం తీసుకుంద‌ని స‌మాచారం. వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ ఇన్చార్జిగా నేదురుమ‌ల్లి రామ్ కుమార్ రెడ్డి పేరును ఖరారు చేసిన‌ట్టు తెలిసింది.

Next Story