Telugu Global
Andhra Pradesh

ఏపీ జెన్‌కో మూడో యూనిట్ జాతికి అంకితం

తాజాగా మూడో యూనిట్ ప్రారంభించ‌డం ద్వారా 800 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుంది. దీనిని ప‌రిశ్ర‌మ‌ల‌కు అనుసంధానం చేయ‌నున్నారు. త‌ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి మ‌రింత ఊత‌మివ్వ‌నున్నారు.

ఏపీ జెన్‌కో మూడో యూనిట్ జాతికి అంకితం
X

నెల్లూరు జిల్లా నేల‌టూరులో దామోద‌రం సంజీవ‌య్య ఏపీ జెన్‌కో మూడో యూనిట్‌ను రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గురువారం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఇది దేశంలోనే మొట్ట‌మొద‌టి సూప‌ర్ క్రిటిక‌ల్ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్రాజెక్టు కావ‌డం గ‌మ‌నార్హం.

దామోద‌రం సంజీవ‌య్య ఏపీ జెన్‌కో మొద‌టి ద‌శ‌లో రెండు యూనిట్ల‌ను 1600 మెగావాట్ల‌ సామ‌ర్థ్యంతో నిర్మించారు. 2008 జూలై 17న దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలో కృష్ణ‌ప‌ట్నంలో ఏపీ జెన్‌కో ప్రాజెక్టుకు శంకుస్థాప‌న చేశారు. 2015లో దామోద‌రం సంజీవ‌య్య ఏపీ జెన్‌కో రెండు యూనిట్ల‌తో విద్యుత్ ఉత్ప‌త్తి ప్రారంభ‌మైంది. అప్ప‌టి నుంచీ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు విద్యుత్.. కోత‌లు లేకుండా అందుబాటులోకి వ‌చ్చింది.

తాజాగా మూడో యూనిట్ ప్రారంభించ‌డం ద్వారా 800 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుంది. దీనిని ప‌రిశ్ర‌మ‌ల‌కు అనుసంధానం చేయ‌నున్నారు. త‌ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి మ‌రింత ఊత‌మివ్వ‌నున్నారు.

ఇదే క్ర‌మంలో కృష్ణ‌ప‌ట్నం పోర్టు నిర్వాసితుల ప్యాకేజీ రూ.35.75 కోట్లు 16,128 మ‌త్స్య‌కార కుటుంబాల‌కు సీఎం నేరుగా వారి ఖాతాల్లో వేయ‌డం ద్వారా అందించ‌నున్నారు. అలాగే కృష్ణ‌ప‌ట్నం పోర్టు ప‌రిధిలోని ముత్తుకూరు మండ‌లం నేల‌టూరు ప్రాంతంలోని ప‌ట్ట‌పాలెం మ‌త్స్య‌కారులు, మ‌త్స్య‌కారేత‌రుల చిర‌కాల స్వప్న‌మైన ఫిషింగ్ జెట్టి నిర్మాణానికి సీఎం శంకుస్థాప‌న చేశారు. రూ.25 కోట్ల అంచ‌నా వ్య‌యంతో దీనిని నిర్మించ‌నున్నారు.

First Published:  27 Oct 2022 7:21 AM GMT
Next Story