Telugu Global
Andhra Pradesh

ఏపీకీ ఓ ఐపీఎల్ టీమ్‌.. - చెన్నై సూప‌ర్ కింగ్స్ మార్గ‌నిర్దేశం..

'ఆడుదాం ఆంధ్ర' పేరుతో ప్ర‌తి ఏటా క్రీడా సంబరాలు నిర్వహించాలని సీఎం జ‌గ‌న్ చెప్పారు. ఇందుకోసం ప్రతి మండలంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాల‌ని చెప్పారు. గ్రామ స్థాయిలో ఆడే వారికి క్రీడా సామగ్రి అందించాల‌న్నారు.

ఏపీకీ ఓ ఐపీఎల్ టీమ్‌.. - చెన్నై సూప‌ర్ కింగ్స్ మార్గ‌నిర్దేశం..
X

భ‌విష్య‌త్తులో ఏపీ నుంచి కూడా ఒక ఐపీఎల్ టీమ్ ఉండేలా చూడాల‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో క్రీడలు, యువజన సర్వీసుల శాఖపై సీఎం గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ రాష్ట్రంలో క్రికెట్ ఆటకు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మార్గనిర్దేశం చేయనుందని చెప్పారు. రాష్ట్రంలో మూడు క్రికెట్ మైదానాలను క్రికెట్ శిక్షణ కార్యక్రమాల కోసం చెన్నై సూపర్ కింగ్స్‌కు అప్పగిస్తామ‌ని తెలిపారు. రాష్ట్ర యువ క్రీడాకారుల‌కు అంబ‌టి రాయుడు, కేఎస్ భ‌ర‌త్ లాంటివారు స్ఫూర్తిదాయ‌క‌మ‌ని క్రికెట్ జ‌ట్టు త‌యారీకి వారి సేవ‌ల‌ను వినియోగించుకోవాల‌ని సూచించారు. భవిష్యత్తులో ముంబై ఇండియన్స్ లాంటి జట్ల సహాయం కూడా తీసుకుంటామ‌ని చెప్పారు. దీనివల్ల ప్రొఫెషనలిజం బాగా పెరుగుతుందన్నారు.

ఆడుదాం ఆంధ్ర‌.. పేరిట ఏటా క్రీడా సంబ‌రాలు

'ఆడుదాం ఆంధ్ర' పేరుతో ప్ర‌తి ఏటా క్రీడా సంబరాలు నిర్వహించాలని సీఎం జ‌గ‌న్ చెప్పారు. ఇందుకోసం ప్రతి మండలంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాల‌ని చెప్పారు. గ్రామ స్థాయిలో ఆడే వారికి క్రీడా సామగ్రి అందించాల‌న్నారు. విజేతలకు బహుమతులతో పాటు కిట్లు ఇవ్వాలని చెప్పారు. సచివాలయానికి కూడా భవిష్యత్తులో కిట్లు ఇచ్చే ఆలోచనలు చేయాలన్నారు. ఉన్నత పాఠశాలలు, ఆపై స్థాయిలో తప్పనిసరిగా క్రీడా సామగ్రి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. నియోజకవర్గానికో ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

First Published:  16 Jun 2023 3:42 AM GMT
Next Story