Telugu Global
Andhra Pradesh

ఢిల్లీలో జగన్ వరుస భేటీలు..

మధ్యాహ్నం 2.30 గంటలకు అమిత్ షా ని కలసిన జగన్, 4.30గంటలకు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. దాదాపు గంటా 20నిమిషాల సేపు ఆయన మోదీతో పలు విషయాలు చర్చించారు.

ఢిల్లీలో జగన్ వరుస భేటీలు..
X

ఏపీ సీఎం జగన్ ఢిల్లీలో వరుస భేటీలతో బిజీ అయ్యారు. ముందుగా ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సమావేశమయ్యారు. 45 నిమిషాల పాటు ఈ సమావేశం కొనసాగింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలపై అమిత్ షా తో జగన్ చర్చించినట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్ట్‌ కి ఇవ్వాల్సిన నిధులను కూడా మరోసారి గుర్తు చేశారు జగన్.

మోదీతో భేటీ..

మధ్యాహ్నం 2.30 గంటలకు అమిత్ షా ని కలసిన జగన్, 4.30గంటలకు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. దాదాపు గంటా 20నిమిషాల సేపు ఆయన మోదీతో పలు విషయాలు చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, అభివృద్ధి పనులు, నిధుల విడుదలపై ప్రధానితో చర్చించారు జగన్.

నిర్మలమ్మకు వినతులు..

మోదీతో భేటీ అనంతరం వెంటనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ని కూడా కలిశారు సీఎం జగన్. ఈ భేటీలో రాష్ట్రానికి ఆర్థిక సహాయం, పోలవరం నిధులు, ఇతర అంశాలపై చర్చించారు. నిర్మలమ్మ మీటింగ్ తో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ప్రధాని, ఇతర మంత్రులతో జగన్ ఏయే అంశాలపై చర్చించారు, కేంద్రం నుంచి స్పందన సానుకూలంగా ఉందా లేదా అనే విషయాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

First Published:  5 July 2023 1:36 PM GMT
Next Story