Telugu Global
Andhra Pradesh

'వెలిగొండ' జాతికి అంకితం చేసిన జగన్‌.. ప్రాజెక్టు ప్రత్యేకతలివీ..

వచ్చే సీజన్‌లో శ్రీశైలం ప్రాజెక్టుకు కృష్ణా వరద జలాలు చేరి, నీటి మట్టం కనీసస్థాయికి అంటే 854 అడుగులకు చేరుకున్న వెంటనే జలాలను వెలిగొండ జంట సొరంగాల ద్వారా ఆ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమల సాగర్‌కు తరలించడానికి రంగం సిద్ధం చేశారు.

వెలిగొండ జాతికి అంకితం చేసిన జగన్‌.. ప్రాజెక్టు ప్రత్యేకతలివీ..
X

వెలిగొండ ప్రాజెక్టు దశాబ్దాల కల సాకారమైంది. వెలిగొండ ప్రాజెక్టును బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ జాతికి అంకితం చేశారు. ఆసియాలోనే అత్యంత పొడవైన వెలిగొండ ప్రాజెక్టు జంట సొరంగాల నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టి పూర్తిచేశారు. ప్రకాశం జిల్లా దొర్నాల మండలం చెర్లోపల్లిలో వెలిగొండ ప్రాజెక్టును జగన్‌ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలల్లోని దుర్భిక్ష ప్రాంతాల్లో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అంతేకాకుండా ఆ జిల్లాల్లోని 30 మండలాల్లో 15.25 లక్షల మందికి మంచినీరు అందుబాటులోకి వస్తుంది.

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వెలిగొండ ప్రాజెక్టులో అంతర్బాగమైన నల్లమల సాగర్‌కు కృష్ణా జలాలలను తరలించేందుకు వీలుగా సొరంగాల నిర్మాణం చేపట్టారు. నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌ సామర్థ్యం 54 టిఎంసీలు. మొదటి సొరంగాన్ని 2021 జనవరి 13వ తేదీ నాటికి జగన్‌ పూర్తి చేయించారు. రెండో టన్నెల్‌ను 2024 జనవరి 21వ తేదీ నాటికి పూర్తి చేయించారు.

వచ్చే సీజన్‌లో శ్రీశైలం ప్రాజెక్టుకు కృష్ణా వరద జలాలు చేరి, నీటి మట్టం కనీస స్థాయికి అంటే 854 అడుగులకు చేరుకున్న వెంటనే జలాలను వెలిగొండ జంట సొరంగాల ద్వారా ఆ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమల సాగర్‌కు తరలించడానికి రంగం సిద్ధం చేశారు.

వెలిగొండ ప్రాజెక్టు జంట సొరంగాల పనుల పురోగతి ఇలా.....

వైఎస్‌ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో 20.33 కిలోమీటర్ల మేర పనులు జరగగా, చంద్రబాబు పాలనలో కేవలం 6.68 కిలోమీటర్ల మేర మాత్రమే జరిగాయి. రెండేళ్లు కరోనా కష్టకాలం ఎదురైనప్పటికీ జగన్‌ పాలనలో 10.56 కిలోమీటర్ల మేర పనులు జరిగాయి.

2004 -14 మధ్య వైఎస్‌ రాజశేఖర రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుపై రూ.3,610 కోట్లు ఖర్చు చేయగా, చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2014`19 మధ్య కాలంలో రూ.1,386 కోట్లు ఖర్చు చేశారు. కాంట్రాక్టర్లకు రూ.631 కోట్లు దోచి పెట్టారని కాగ్‌ నివేదిక తప్పు పట్టింది కూడా. జగన్‌ ప్రభుత్వం రూ.978 కోట్లు ఖర్చు చేసింది.

First Published:  6 March 2024 10:23 AM GMT
Next Story