కందుకూరు మృతులకు సీఎం సంతాపం.. ఆర్థిక సాయం ప్రకటన
తొక్కిసలాటలో మరణించిన వారికి రూ.2 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి రూ.50వేల చొప్పున పరిహారం అందించాల్సిందిగా అధికారులను ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
BY Telugu Global29 Dec 2022 5:56 AM GMT

X
Telugu Global29 Dec 2022 5:56 AM GMT
న్యూఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కందుకూరులో జరిగిన విషాదం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో చాలా మంది చనిపోవడం తనను కలచివేసిందని, తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. తొక్కిసలాటలో మరణించిన వారికి రూ.2 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి రూ.50వేల చొప్పున పరిహారం అందించాల్సిందిగా అధికారులను ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
Next Story