Telugu Global
Andhra Pradesh

కుర్చీలతో కొట్టుకున్న వైసీపీ శ్రేణులు

ఆదివారం జరిగిన కదిరి నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలోనూ అదే సీన్‌ రిపీట్ అయింది. ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, అసమ్మతి నేత పూల శ్రీనివాస్‌ రెడ్డి వర్గీయులు సమావేశంలోనే ఘర్షణ పడ్డారు.

కుర్చీలతో కొట్టుకున్న వైసీపీ శ్రేణులు
X

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో వైసీపీ అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. వీటిని పరిష్కరించడం ఇన్‌చార్జ్ మంత్రి పెద్దిరెడ్డికి పెద్ద సవాల్‌గా మారింది. తమ ఎమ్మెల్యేలు అవినీతిపరులని, కుటుంబ సభ్యులతో కలిసి దోచుకుంటూ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారంటూ ఇప్పటికే మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి, పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు మంత్రి పెద్దిరెడ్డి ముందు బైఠాయించిన ఉదంతాలు ఉన్నాయి. మాజీ మంత్రి శంకర్‌ నారాయణ.. వైసీపీలోని రెడ్డి సామాజికవర్గం నేతలను టార్గెట్‌ చేసుకుని, అట్రాసిటీ కేసులు పెట్టిస్తూ అణచివేస్తున్నారన్న విషయాన్ని పెద్దిరెడ్డి ముందు ప్రత్యర్థి వర్గం ఉంచింది.

తాజాగా పెద్దిరెడ్డి సమక్షంలోనే కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాల్లో వైసీపీ విభేదాలు భగ్గుమన్నాయి. పుట్టపర్తి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని పెద్దిరెడ్డి ఏర్పాటు చేయగా.. అసమ్మతి నేతలు గొడవ చేస్తారన్న కారణంతో వారిని పోలీసులు ముందే అడ్డుకున్నారు. సమావేశానికి రాకుండా మాజీ ఎమ్మెల్యే పాముదుర్తి రవీందర్‌ రెడ్డి కుమారుడు ఇంద్రజిత్‌ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఆయన వర్గీయులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నివాదాలు చేశారు.

ఆదివారం జరిగిన కదిరి నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలోనూ అదే సీన్‌ రిపీట్ అయింది. ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, అసమ్మతి నేత పూల శ్రీనివాస్‌ రెడ్డి వర్గీయులు సమావేశంలోనే ఘర్షణ పడ్డారు. మంత్రిపెద్దిరెడ్డి రావడానికి ముందు కుర్చీలతో కొట్టుకున్నారు. వేదికపైకి శ్రీనివాస్‌ రెడ్డి వెళ్లేందుకు ప్రయత్నించగా ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకోవడంతో గొడవ మొదలైంది. 15 నిమిషాల పాటు పరస్సరం కుర్చీలు విసుకున్నారు. అనంతరం పోలీసులు జోక్యం చేసుకుని ఇరుపక్షాలను శాంతింప చేశారు.

ఈ గొడవల అనంతరం మంత్రి పెద్దిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. విభేదాలు పక్కన పెట్టి జగన్‌ను మరోసారి సీఎంను చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

First Published:  19 Dec 2022 3:14 AM GMT
Next Story