Telugu Global
Andhra Pradesh

గంగిరెడ్డి బెయిల్ రద్దు ఆదేశాలపై సీజేఐ ఆశ్చర్యం

ముందుగానే ఫలాన రోజు బెయిల్‌ మంజూరు అవుతుందని హైకోర్టు చెప్పడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి ఉత్తర్వులు ఎలా ఇస్తారని అసహనం వ్యక్తం చేశారు.

గంగిరెడ్డి బెయిల్ రద్దు ఆదేశాలపై సీజేఐ ఆశ్చర్యం
X

వైఎస్ వివేకానందరెడ్డి కేసులో ఏ-1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు సందర్భంగా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీ.వై.చంద్రచూడ్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇవేం ఉత్తర్వులు అని తలపట్టుకున్నారు.

హ‌త్య కేసులో ఏ-1 గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని గతంలో తెలంగాణ హైకోర్టును సీబీఐ కోరింది. సాక్షులను బెదిరిస్తున్నారని సీబీఐ ఆరోపించింది. సీబీఐ విజ్ఞప్తికి అంగీకరించిన తెలంగాణ హైకోర్టు ఏప్రిల్ ఆఖరిలో బెయిల్ రద్దు చేసి.. మే5లోపు లొంగిపోవాలని ఆదేశించింది. ఆమేరకు గంగిరెడ్డి సీబీఐ ముందు లొంగిపోయారు. అయితే బెయిల్‌ను రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో హైకోర్టు పెట్టిన షరతులను సవాల్ చేస్తూ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారు.

జూన్‌ 30లోగా దర్యాప్తు పూర్తికి సుప్రీంకోర్టు గడువు విధించిన నేపథ్యంలో.. గంగిరెడ్డి బెయిల్‌ను జూన్‌ 30 వరకు మాత్రమే రద్దు చేస్తున్నామని.. ఆలోపు చార్జిషీట్‌ వేయాలని, జూలై 1న గంగిరెడ్డి బెయిల్ మంజూరు అవుతుందని హైకోర్టు చెప్పింది. ఇలా ముందుగానే ఫలాన రోజు బెయిల్‌ మంజూరు అవుతుందని హైకోర్టు చెప్పడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి ఉత్తర్వులు ఎలా ఇస్తారని అసహనం వ్యక్తం చేశారు.

సునీతారెడ్డి పిటిషన్‌ను విచారించిన సీజేఐ.. దాన్ని వేకేషన్ బెంచ్‌కు బదిలీ చేస్తున్నట్టు చెప్పారు. వచ్చే వారం ఆ పిటిషన్‌ను వెకేషన్‌ బెంచ్‌ విచారించనుంది.

First Published:  18 May 2023 8:49 AM GMT
Next Story