Telugu Global
Andhra Pradesh

మద్యం స్కాంలో కూడా ఇరుక్కున్నట్లేనా?

చంద్రబాబు పాత్రకు సంబంధించి లాయర్లు, లోకేష్ వాదనలన్నీ అబద్ధాలేనని తాజాగా తేలిపోయింది. ఎలాగంటే ఫీజుల రద్దుకు సంబంధించిన నోట్ ఫైలులో చంద్రబాబు, కొల్లు రవీంద్ర డిజిటల్ సంతకాలు చేశారు.

మద్యం స్కాంలో కూడా ఇరుక్కున్నట్లేనా?
X

అచ్చంగా స్కిల్ స్కామ్‌లో ఇరుక్కున్నట్లే చంద్రబాబు మద్యం స్కాంలో కూడా ఇరుక్కున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. డిస్టిల్లరీలు, బార్లు, మద్యం షాపులకు ప్రివిలేజ్ ఫీజు, జీఎస్టీలను రద్దు చేసిన స్కామ్‌లో చంద్రబాబు, కొల్లు రవీంద్ర తదితరులపై సీఐడీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టు కానప్పటికీ చంద్రబాబు వేసిన ముందస్తు బెయిల్ పిటీషన్ హైకోర్టు విచారణలో ఉంది. బెయిల్ విచారణ సందర్భంగా చంద్రబాబు లాయర్లు, లోకేష్ అండ్ కో ఒకటే వాదన వినిపిస్తున్నారు.

అదేమిటంటే ప్రివిలేజ్ ఫీజు, జీఎస్టీ రద్దు చేయటం అన్నది క్యాబినెట్ నిర్ణయమట. క్యాబినెట్ తీసుకున్న నిర్ణయానికి చంద్రబాబును బాధ్యుడిని ఎలా చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఫీజుల రద్దు నిర్ణయానికి సంబంధించి చంద్రబాబు సంతకాలు కూడా చేయలేదని పదేపదే వాదిస్తున్నారు. 2012 నుండి అమల్లో ఉన్న ప్రివిలేజ్ ఫీజు, జీఎస్టీ 6 శాతం తగ్గించటం వల్ల ప్రభుత్వానికి రూ.1300 కోట్లు నష్టం వచ్చిందని సీఐడీ ఆరోపించింది. ఫీజులను ఎందుకు రద్దు చేశారంటే లబ్ధిపొందిన డిస్టల్లరీలు, బార్లు, షాపుల్లో అత్యధికం టీడీపీ నేతలవే అని సీఐడీ అఫిడవిట్‌లో చెప్పింది.

చంద్రబాబు పాత్రకు సంబంధించి లాయర్లు, లోకేష్ వాదనలన్నీ అబద్ధాలేనని తాజాగా తేలిపోయింది. ఎలాగంటే ఫీజుల రద్దుకు సంబంధించిన నోట్ ఫైలులో చంద్రబాబు, కొల్లు రవీంద్ర డిజిటల్ సంతకాలు చేశారు. 2015లో జరిగిన క్యాబినెట్ సమావేశానికి ఎక్సైజ్ కమిషనర్ నుండి ఒక ఫైలు వచ్చింది. అందులో ఏముందంటే ప్రివిలేజ్ ఫీజును 10 రెట్లు పెంచాలని. క్యాబినెట్ సమావేశం తర్వాత రెండు జీవోలు జారీ అయ్యాయి. అందులో ప్రివిలేజ్ ఫీజు విషయానికి సంబంధించిన అంశమే లేదు.

అయితే అదే రోజు సాయంత్రం అంటే క్యాబినెట్ సమావేశం అయిపోయిన తర్వాత‌ ఎక్సైజ్ కమిషనర్ దగ్గర నుండి ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని మరో నోట్ వచ్చింది. దీనిపై చంద్రబాబు, కొల్లు రవీంద్ర సంతకాలు చేయగానే ప్రివిలేజ్ ఫీజు, జీఎస్టీని రద్దు చేస్తూ ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. దీనికి క్యాబినెట్ ఆమోదం లేదన్నది సీఐడీ ఆరోపణ. ప్రివిలేజ్ ఫీజు, జీఎస్టీని రద్దు చేయటంపై అప్పట్లోనే ప్రిన్సిపల్ అకౌంటెట్ జనరల్ తీవ్రంగా తప్పుపట్టినా చంద్రబాబు పట్టించుకోలేదు. చంద్రబాబు, కొల్లు సంతకాలు చేసిన నోట్‌ను, ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ అభ్యంతరాలను సీఐడీ కోర్టులో సబ్మిట్ చేసింది. మరి ఈ ఆధారాలను కోర్టు ఎలా పరిగణిస్తుందో చూడాలి.

First Published:  25 Nov 2023 5:31 AM GMT
Next Story