ఏపీ వ్యాప్తంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ అధికారుల ఇళ్లలో సీఐడీ సోదాలు
చిట్ ఫండ్ చట్టానికి విరుద్దంగా ఖాతాదారుల సొమ్మును అక్రమంగా మళ్ళించారని, మార్గదర్శి చిట్ ఫండ్స్ అనేక చట్ట ఉల్లంఘనలకు పాల్పడిందనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. నిధుల మళ్లింపుపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ సీఐడీకి ఫిర్యాదు చేయడంతో తాజాగా సోదాలను చేపట్టారు.
BY Telugu Global11 March 2023 5:28 AM GMT

X
Telugu Global11 March 2023 5:28 AM GMT
మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ నిధులను అక్రమంగా మళ్ళించిందనే ఆరోపణపై ఏపీ సీఐడీ విచారణ నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ కీలక అధికారుల ఇళ్ళల్లో సీఐడీ సోదాలు నిర్వహిస్తోంది.
చిట్ ఫండ్ చట్టానికి విరుద్దంగా ఖాతాదారుల సొమ్మును అక్రమంగా మళ్ళించారని, మార్గదర్శి చిట్ ఫండ్స్ అనేక చట్ట ఉల్లంఘనలకు పాల్పడిందనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. నిధుల మళ్లింపుపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ సీఐడీకి ఫిర్యాదు చేయడంతో తాజాగా సోదాలను చేపట్టారు.ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచే ఏపీ లోని అన్ని జిల్లాల్లో మేనేజర్లు, ఇతర అధికారుల ఇళ్ళల్లో సోదాలు జరుగుతున్నాయి. సీఐడీ అధికారులు విజయవాడ మెయిన్ బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
Next Story