Telugu Global
Andhra Pradesh

ఆధారాలను ధ్వంసం చేసిన `మార్గదర్శి`?

బ్రాంచ్ కార్యాలయాల్లోని రికార్డులను, ఆధారాలు అనుకున్నవాటిని జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి ధ్వంసం చేయించిందని సీఐడీ అధికారులు గుర్తించారట. కంప్యూటర్లలోని వివరాలను కూడా సంపూర్ణంగా డిలీట్ చేయించినట్లు తెలుస్తోంది. ఆధారాలను ఎలా డిలీట్ చేయాలో తెలియ‌నివాళ్ళకు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రాక్టికల్‌గా నిపుణులతో డెమో ఇప్పించినట్లు సమాచారం.

ఆధారాలను ధ్వంసం చేసిన `మార్గదర్శి`?
X

తమ సంస్థ‌లో జరుగుతున్న అవకతవకలు బ‌య‌ట‌ప‌డ‌కుండా ఉండేందుకు మార్గదర్శి యాజమాన్యం అన్నీ ఆధారాలను ధ్వంసం చేస్తున్నట్లు సీఐడీ గుర్తించిందట. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి మీడియా చెప్పింది. బ్రాంచ్ కార్యాలయాల్లోని రికార్డులను, ఆధారాలు అనుకున్నవాటిని జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి ధ్వంసం చేయించిందని సీఐడీ అధికారులు గుర్తించారట. కంప్యూటర్లలోని వివరాలను కూడా సంపూర్ణంగా డిలీట్ చేయించినట్లు తెలుస్తోంది. ఆధారాలను ఎలా డిలీట్ చేయాలో తెలియ‌నివాళ్ళకు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రాక్టికల్‌గా నిపుణులతో డెమో ఇప్పించినట్లు సమాచారం.

గడచిన డిసెంబర్ నుంచి మార్గదర్శిలో లావాదేవీలు దాదాపు స్తంభించిపోయాయట. సంస్థ‌పై ఆర్థిక‌ప‌ర‌మైన ఆరోపణలు రావటంతో చిట్టీలు వేసేందుకు ఖాతాదారులు ముందుకు రాలేదట. దాంతో ఆర్థిక‌ లావాదేవీలు బాగా దెబ్బతిన్నాయి. కొత్త చిట్టీలు ఆగిపోవటంతో అప్పటికే చిట్టీలను పాడుకున్న వాళ్ళకి డబ్బులు చెల్లించటానికి యాజమాన్యం నానా అవస్తలు పడుతున్నట్లు సీఐడీ గుర్తించింది. ష్యూరిటీలని, ఇంకోటని ఏదో కారణాలు చూపించి ఖాతాదారులకు డబ్బులు ఇవ్వకుండా కావాలనే ఆలస్యం చేస్తోంద‌ట‌.

మార్గదర్శిలో ఖాతాదారులు జ‌మ చేసిన‌ డబ్బులను సంస్థ‌ ఖాతాల్లోనే ఉంచి ఉంటే ఇప్పుడీ సమస్య వచ్చి ఉండేదికాదని, నిధులన్నీ ఎప్పటికప్పుడు దారి మళ్ళించేయటంతోనే డబ్బులకు ఇబ్బందులు పడుతున్నట్లు అధికారులకు అర్థ‌మైంది. రశీదు రూపంలో చందాదారుల నుండి వసూలు చేసిన మొత్తాలను మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్లోకి మళ్ళించేసినట్లు సీఐడీ గుర్తించింది. కొత్త చిట్టీలు కట్టడానికి ఖాతాదారులు వస్తుంటే నిధుల సమస్య ఉండేదికాదని, కొత్త చందాదారులు రాకపోవటంతోనే ఫండ్స్ ఛైన్ ఆగిపోయిందని అర్థ‌మవుతోంది.

మ్యూచువల్ ఫండ్స్, షేర్లలో పెట్టిన పెట్టుబడులు వెనక్కు తీసుకోలేక, కొత్త చందాదారులు రాకపోవటంతో చిట్టీలు పాడుకున్న వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేక యాజమాన్యం నానా అవస్తలు పడుతోందని సమాచారం. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు బ్రాంచ్‌ల్లో చిట్టీదారులు పదుల సంఖ్యలో తమకు రావాల్సిన డబ్బుల కోసం ప్రదక్షిణలు చేస్తున్నారట. అయితే చందాదారులకు డబ్బులు ఇవ్వలేక బ్రాంచ్ మేనేజర్లకు ఏమిచేయాలో దిక్కుతోచటంలేదట. చిట్ ఫండ్స్ సంస్థ‌ ద్వారా వసూలు చేసిన వందలాది కోట్ల రూపాయలను చిట్టేతర వ్యాపారాలకు మళ్ళించిన ఫలితంగానే మార్గదర్శికి ఇప్పుడీ ప‌రిస్థితి వ‌చ్చింద‌ని ఖాతాదారులు అంటున్నారు. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.

First Published:  26 April 2023 5:39 AM GMT
Next Story