Telugu Global
Andhra Pradesh

నేను మాటలు పడలేను, తమ్ముడే రాజకీయాలకు సరైనోడు..

తన పరాజయానికి కారణాలు చెప్పుకుంటూనే, తమ్ముడి విజయాన్ని ఆకాంక్షిస్తున్నట్టు పరోక్షంగా హింట్ ఇచ్చారు. మీ అందరి ఆశీస్సులున్నాయని బహిరంగ వేదికపై ప్రకటించారంటే, తన స్నేహితులు, శ్రేయోభిలాషులు.. జనసేనకు మద్దతివ్వాలని పరోక్షంగా చిరంజీవి సూచించినట్టే లెక్క.

నేను మాటలు పడలేను, తమ్ముడే రాజకీయాలకు సరైనోడు..
X

పాలిటిక్స్ కి తాను దూరం దూరం అంటూనే సమయానుకూలంగా స్పందిస్తుంటారు మెగాస్టార్. తాజాగా ఆయన చదువుకున్న కాలేజీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో చిరంజీవి మరోసారి రాజకీయాలు మాట్లాడారు. తాను మనసులో గట్టిగా అనుకుంటే దాని అంతు తేల్చే వరకు నిద్రపోనని, కానీ ఓ విషయంలో మాత్రం తాను వెనక్కి తగ్గాల్సి వచ్చిందని, అది ఏ రంగమో అందరికీ తెలుసున్నారు.

తమ్ముడే సరైనోడు..

రాజకీయాలు తనకు ఎందుకు సూటు కావో మరోసారి తేల్చి చెప్పారు చిరంజీవి. రాజకీయాల్లో రాణించాలంటే రాటు తేలాలని, మాటలు అనాలి, అనిపించుకోవాలన్నారు. మాటలు పడటం నాకు అవసరమా..? అని కాస్త గ్యాప్ ఇచ్చారు. కానీ తన తమ్ముడు పవన్ కల్యాణ్ తనలా కాదని, మాటలు అంటాడు, మాటలు పడతాడని చెప్పుకొచ్చారు. రాజకీయాలకు తనకంటే పవనే సరైనోడు అని అన్నారు చిరంజీవి.

ఏదో ఒకరోజు ఆ స్థాయిలో ఉంటాడు..

పవన్‌ కల్యాణ్‌ కు మీరందరూ ఉన్నారు కదా, మీ ఆశీస్సులతో ఏదో ఒకరోజు అత్యున్నత స్థానంలో పవన్‌ ని చూస్తాం అని చెప్పుకొచ్చారు చిరంజీవి. కాలేజీ ఫంక్షన్లో పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూనే మెల్లగా రాజకీయ వ్యాఖ్యలు చేశారు చిరంజీవి. తన పరాజయాన్ని చెప్పుకుంటూనే, తమ్ముడి విజయాన్ని ఆకాంక్షిస్తున్నట్టు పరోక్షంగా హింట్ ఇచ్చారు. మీ అందరి ఆశీస్సులున్నాయని బహిరంగ వేదికపై ప్రకటించారంటే, తన స్నేహితులు, శ్రేయోభిలాషులు.. జనసేనకు మద్దతివ్వాలని పరోక్షంగా చిరంజీవి సూచించినట్టే లెక్క. ప్రస్తుతం చిరంజీవి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఏపీలో పొత్తుల రాజకీయాలు ఎటూ తేలకపోవడంతో జనసేన మరోసారి సింగిల్ ఛాన్స్ అంటోంది. ఈ దశలో పవన్ కల్యాణ్ ని సపోర్ట్ చేస్తూ చిరంజీవి మాట్లాడటం ఆసక్తికరంగా మారింది.

First Published:  20 Nov 2022 11:39 AM GMT
Next Story