Telugu Global
Andhra Pradesh

శ్రీవారి దర్శనాల పేరుతో టీడీపీ అధికార ప్రతినిధి మోసం

తిరుమలలో వీఐపీ బ్రేక్‌ దర్శనం చేయిస్తానని, వసతి ఏర్పాటు చేయిస్తానని చెప్పి 20 వేల రూపాయలు వసూలు చేసినట్టు న్యాయవాది చెబుతున్నారు. ఆ 20వేల రూపాయలను కూడా గూగుల్ పే ద్వారానే పంపినట్టు ఆధారాలు చూపుతున్నారు.

శ్రీవారి దర్శనాల పేరుతో టీడీపీ అధికార ప్రతినిధి మోసం
X

ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి విద్యాసాగర్‌పై చీటింగ్ కేసు నమోదు అయ్యింది. విద్యాసాగర్‌ టీడీపీ తరపున టీవీ చానళ్లలో చురుగ్గా వాదిస్తుంటారు. వైసీపీపై ఒంటికాలితో లేస్తుంటారు. ఇప్పుడాయన ఆన్‌లైన్‌ మోసాలు బయటకు వచ్చాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం కల్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసి మోసం చేశారని హైదరాబాద్‌ కమలానగర్‌కు చెందిన న్యాయవాది సుంకర నరేష్‌ కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తిరుమలలో వీఐపీ బ్రేక్‌ దర్శనం చేయిస్తానని, వసతి ఏర్పాటు చేయిస్తానని చెప్పి 20 వేల రూపాయలు వసూలు చేసినట్టు న్యాయవాది చెబుతున్నారు. ఆ 20వేల రూపాయలను కూడా గూగుల్ పే ద్వారానే పంపినట్టు ఆధారాలు చూపుతున్నారు. డబ్బులు తీసుకున్న తర్వాత తనకు ఎలాంటి దర్శనం ఏర్పాటు కల్పించలేదని, అసలు ఫోన్‌ కూడా తీయడం లేదని న్యాయవాది ఫిర్యాదు చేశారు.

దర్శనం పేరుతో తనకు మోసం చేశారని.. మరొకరు మోసపోకూడదనే తాను ఫిర్యాదు చేసినట్టు న్యాయవాది సుంకర నరేష్ వివరించారు. ఫిర్యాదుపై ప్రాథమిక దర్యాప్తు జరిపిన పోలీసులు.. టీడీపీ అధికార ప్రతినిధి విద్యాసాగర్‌పై ఇదే తరహాలో మరికొన్ని ఆన్‌లైన్‌ ఫిర్యాదులు కూడా ఉన్నాయని తెలిపారు. విద్యాసాగర్‌పై చీటింగ్ కేసు నమోదు చేశారు.

First Published:  11 Sep 2022 11:18 AM GMT
Next Story