Telugu Global
Andhra Pradesh

ప‌రిస్థితులు మారాక.. ఇప్పుడు ఫోక‌స్ అంతా బ్రాహ్మ‌ణిపైనే..!

మొదటి నుండి ఎందుకనో లోకేష్ అంటే ఎల్లో మీడియా కాస్త విముఖంగానే ఉంది. చంద్రబాబుకు ఇచ్చిన పబ్లిసిటి, హైప్‌లో లోకేష్‌కు కనీసం సగం కూడా ఇవ్వటంలేదు.

ప‌రిస్థితులు మారాక.. ఇప్పుడు ఫోక‌స్ అంతా బ్రాహ్మ‌ణిపైనే..!
X

చంద్రబాబుకు ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీని ముందుండి నడిపించేదెవరు? ఇప్పుడు ఈ విషయమే పార్టీలో పెద్ద చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే పార్టీతో పాటు ఎల్లో మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ జరుగుతోంది. అదేమిటంటే నారా లోకేష్‌ను పక్కనపెట్టేసి బ్రాహ్మణికి బాగా హైప్ ఇస్తున్నారు. లోకేష్ కన్నా బ్రాహ్మణి అయితే క్రౌండ్ పుల్లర్ అని బాగా ఊదరగొడుతున్నారు. పైగా లోకేష్‌పైన అరెస్టు కత్తి వేలాడుతోంది.

అందుకనే లోకేష్‌ను పూర్తిగా పక్కనపెట్టేసి ఫుల్‌గా బ్రాహ్మణిని బాగా హైలైట్ చేస్తున్నారు. లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టగానే అరెస్టు చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అందుకనే ఇన్నిరోజుల నుండి ఢిల్లీలోనే కూర్చున్నారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణంలో లోకేష్‌ను సీఐడీ ఏ14గా కేసు నమోదు చేసింది. కాబట్టి ఎప్పుడైనా అరెస్టు చేసే అవకాశముంది.

అరెస్టు నుండి తప్పించుకునేందుకే హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ వేశారు. ముందస్తు బెయిల్ విషయం తేలేంతవరకు రాష్ట్రంలోకి రావద్దని పార్టీలోని కొందరు నేతలు సలహా ఇస్తున్నారట. పాదయాత్ర మొదలవ్వగానే అరెస్టయితే పరువుపోతుందని అంటున్నారట. అందుకనే ఇలాంటి తలనొప్పులు ఉంటాయనే ఎందుకైనా మంచిదని ఏకంగా బ్రాహ్మణి మీదే అందరు ఫోకస్ పెట్టినట్లున్నారు. బ్రాహ్మణి మీద ఫోకస్‌పెట్టారు కాబట్టి ఎల్లోమీడియా లోకేష్‌ను అండర్ ప్లే చేస్తోంది.

మొదటి నుండి ఎందుకనో లోకేష్ అంటే ఎల్లో మీడియా కాస్త విముఖంగానే ఉంది. చంద్రబాబుకు ఇచ్చిన పబ్లిసిటి, హైప్‌లో లోకేష్‌కు కనీసం సగం కూడా ఇవ్వటంలేదు. అదే ఊపులో ఇప్పుడు కూడా లోకేష్‌ను పక్కనపెట్టేసి మొత్తం వ్యవహారాన్ని భువనేశ్వరి, బ్రాహ్మణి చుట్టే తిప్పుతున్నది. ఈ ఇద్దరిలో కూడా మళ్ళీ బ్రాహ్మణికే ఫస్ట్ ప్రయారిటి ఇస్తోంది. ఢిల్లీలో లోకేష్ ఎవరిని కలుస్తున్నారు? ఏమి మాట్లాడుతున్నారనే విషయాన్ని ఎల్లోమీడియా కావాలనే కప్పిపుచ్చుతోంది. మొత్తంమీద లోకేష్‌ను తమ్ముళ్ళు, ఎల్లోమీడియా కలిసే అండర్ ప్లే చేస్తున్నట్లు అర్థ‌మైపోతోంది. దీనివల్ల ఏమవుతోందంటే లోకేష్ నాయకత్వానికి పనికిరాడనే సిగ్నల్ వెళ్తోంది. ఈ విషయాన్ని తమ్ముళ్ళు, ఎల్లోమీడియా గ్రహించటంలేదు.


First Published:  29 Sep 2023 5:32 AM GMT
Next Story