Telugu Global
Andhra Pradesh

చంద్ర‌బాబు కొత్త స్కెచ్‌.. జ‌నానికి బ్రెయిన్‌వాష్ చేయ‌డానికి రంగంలోకి ఇన్‌ఫ్లుయ‌న్స‌ర్లు

జ‌గ‌న్ వ‌చ్చాక వ్య‌వ‌స్థ‌ల‌న్నీ నాశ‌న‌మైపోయాయ‌ని, దోపిడీ, దౌర్జ‌న్యాలు పెరిగిపోయాయ‌ని జ‌నానికి స్ట్రీట్‌ కార్న‌ర్ మీటింగ్‌లు పెట్టి చెప్పాల‌ని చంద్ర‌బాబు వారికి నూరిపోశారు.

చంద్ర‌బాబు కొత్త స్కెచ్‌.. జ‌నానికి బ్రెయిన్‌వాష్ చేయ‌డానికి రంగంలోకి ఇన్‌ఫ్లుయ‌న్స‌ర్లు
X

అబ‌ద్ధాన్ని ప‌దేప‌దే చెప్పి నిజ‌మ‌ని న‌మ్మించ‌డంలో చంద్ర‌బాబు సిద్ధ‌హ‌స్తుడు. జ‌గ‌న్‌పై జ‌నానికి ఇలా విష‌యం నూరిపోయ‌డానికి ఇప్ప‌టికే ఎల్లోమీడియాను అయిదేళ్లుగా వినియోగించుకుంటున్న చంద్ర‌బాబు ఎన్నిక‌ల ప్ర‌చారంలోనూ అదే చేస్తున్నారు. టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మి నేత‌లు చేస్తున్న గోబెల్స్ ప్ర‌చారానికి తాజాగా ఇన్‌ఫ్లుయ‌న్సర్లను రంగంలోకి దింపుతున్నారు చంద్ర‌బాబు. వీధివీధినా తిరిగి, జ‌గ‌న్‌పై విష‌ప్ర‌చారం చేయాల‌ని, బాబొస్తేనే రాష్ట్రం బాగుప‌డుతుంద‌ని జ‌నానికి బ్రెయిన్‌వాష్ చేయాల‌ని వాళ్ల‌కు నూరిపోసి పంపారు.

1500 మంది ఇన్‌ఫ్లుయ‌న్స‌ర్లు.. కోటీ 80 ల‌క్ష‌ల మందికి చెప్పాల‌ట‌!

1500 మంది ప్ర‌భావ‌శీలురు (ఇన్‌ఫ్లుయ‌న్స‌ర్లు)ను టీడీపీ త‌యారుచేసింది. వీరికి నిన్న చంద్ర‌బాబుతో శిక్ష‌ణ ఇప్పించింది. జ‌గ‌న్ వ‌చ్చాక వ్య‌వ‌స్థ‌ల‌న్నీ నాశ‌న‌మైపోయాయ‌ని, దోపిడీ, దౌర్జ‌న్యాలు పెరిగిపోయాయ‌ని జ‌నానికి స్ట్రీట్‌ కార్న‌ర్ మీటింగ్‌లు పెట్టి చెప్పాల‌ని చంద్ర‌బాబు వారికి నూరిపోశారు. అర్జెంట్‌గా చంద్ర‌బాబును తిరిగి అధికార పీఠంపైకి ఎక్కించేస్తే గానీ ఆంధ్ర‌ప్రదేశ్ బాగుప‌డ‌ద‌ని ప్ర‌జ‌ల‌కు ప‌దేప‌దే చెప్పాల‌ని వారికి చెప్పిపంపారు.

వామ్మె ఇవి మామూలు లెక్క‌లు కాదు!

1500 మంది ఇన్‌ఫ్లుయ‌న్స‌ర్లు.. ఒక్కొక్క‌రు రోజుకు 4 స్ట్రీట్ మీటింగ్‌లు పెట్టాల‌ట‌. ఒక్కో మీటింగ్‌లో క‌నీసం 200 మందిని పోగేసి, వాళ్ల‌కు జ‌గ‌న్ విధ్వంసం చేసేశార‌ని, బాబొస్తే ఇర‌గ‌దీసేస్తార‌ని చెప్పాల‌ట‌. అలా ఒక్కో ప్ర‌భావ‌శీల వ్య‌క్తి రోజుకు 4 మీటింగ్‌ల్లో మొత్తం 800 మందికి నూరిపోయాల‌ట‌. అలా 1500 మంది ఒక్కొక్క‌రు రోజుకు 800 మంది చొప్పున మొత్తం 15 రోజుల్లో కోటీ 80 ల‌క్ష‌ల మందికి ఈ విష‌యాన్ని చెవినిల్లు కట్టుకుని చెప్పేయాల‌ట‌! చంద్ర‌బాబు చెబుతున్న ఈ లెక్క‌లు వినడానికి చాలా బాగున్నాయి.. కానీ, చంద్ర‌బాబు మీటింగ్‌కే రాని జ‌నం ఎవ‌రో ఇన్‌ఫ్లుయన్స‌ర్‌ని అని బాబు బాకా ఊదుతుంటే విన‌డానికి ఎగ‌బ‌డి వ‌చ్చేస్తారా అన్న‌దే అస‌లు ప్ర‌శ్న‌.

First Published:  22 April 2024 5:50 AM GMT
Next Story