Telugu Global
Andhra Pradesh

రాయపూర్‌ కథ ఉండనే ఉంది, అయినా తగ్గని చంద్రబాబు

అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేయడంలో గత అనుభవాలను చంద్రబాబు పరిగణనలోకి తీసుకోలేదు. దేశంలో ఏర్పాటు చేసిన రాజధానుల పరిస్థితి ఎలా ఉందనే విషయంపై ఆయన అధ్యయనం చేయించలేదు.

రాయపూర్‌ కథ ఉండనే ఉంది, అయినా తగ్గని చంద్రబాబు
X

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఎంపిక విషయంలో గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేయడం వెనక పెద్ద మతలబే ఉందనేది బయటపడిన విషయమే. కృత్రిమ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని సృష్టించి స్వార్థ ప్రయోజనం కోసం అమరావతి ప్రాంతాన్ని ఏపీ రాజధానిగా ఎంపిక చేశారనే విషయం వెలుగు చూసిందే.

అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేయడంలో గత అనుభవాలను చంద్రబాబు పరిగణనలోకి తీసుకోలేదు. దేశంలో ఏర్పాటు చేసిన రాజధానుల పరిస్థితి ఎలా ఉందనే విషయంపై ఆయన అధ్యయనం చేయించలేదు. గ్రీన్‌ ఫీల్డ్‌ రాజధానుల ప్రయోగం విఫలమైందనే విషయాన్ని ఆయన పట్టించుకోలేదు. దేశంలో కొత్తగా ఏర్పడిన ఛతీస్‌గఢ్‌ రాష్ట్రం రాజధానిగా నయా రాయపూర్‌ను నిర్మించారు. ఇప్పటికీ అక్కడ ప్రజలు నివాసం ఉండడం లేదు. ఉద్యోగులు ఉదయం పూట వచ్చి సాయంత్రం పాత రాయపూర్‌కు పరుగులు పెడుతున్నారు.

చండీఘడ్‌ దేశంలో మొట్టమొదటి గ్రీన్‌ఫీల్డ్‌ క్యాపిటల్‌. అది ఇప్పటికీ పెద్దగా అభివృద్ది చెందలేదు. అదే నోయిడా, గురుగ్రామ్‌ సహజాతి సహజంగా అభివృద్ధి చెందాయి. ఈ ప్రాంతాల్లో వివిధ బడా సంస్థల కార్యాలయాలు వెలిశాయి. దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా గ్రీఫ్‌ఫీల్డ్‌ క్యాపిటల్‌ ప్రయోగాలు ఘోరాతిఘోరంగా విఫలమయ్యాయి,

వివిధ విఫలప్రయోగాలు కళ్ల ముందే ఉన్పప్పటికీ చంద్రబాబు అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేయడం వెనక స్వార్థ ప్రయోజనం తప్ప ఏమీ లేదు. ఇప్పటికీ తాను తిరిగి అధికారంలోకి వస్తే అమరావతిని నిర్మిస్తానని చెప్పుతున్నారు. అమరావతిలో కార్యాలయాల కోసం తాత్కాలిక భవనాలను నిర్మించారు. వర్షాలు పడితే పైకప్పులు కురుస్తున్నాయి. భవనాలు నీటితో నిండిపోతున్నాయి. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రాజధాని అభివృద్ధి అనేది ఏ మాత్రం ముందుకు కదలలేదు.

రాజధాని కోసం భూసేకరణ చేసిన విధానాన్ని దుమ్మెత్తిపోస్తూ గతంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు టిడిపితో పొత్తు పెట్టుకుని అమరావతి రాజధానిని వేగంగా అభివృద్ది చేస్తామని ఆయన అంటున్నారు. మొత్తంగా అమరావతిని రాజధానిగా నిర్ణయించడంలో చంద్రబాబు శివరామకృష్ణన్‌ కమిటీ చేసిన సూచనలను పట్టించుకోకపోవడమే కాకుండా అధికారాన్ని ఒక చోట కేంద్రీకరించి, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు వివక్షకు గురయ్యే పనికి ఒడిగట్టారు.

First Published:  1 Feb 2024 7:08 AM GMT
Next Story