Telugu Global
Andhra Pradesh

కక్కలేక, మింగలేక.. డ్యామేజీ కంట్రోల్ కోసం బాబు ట్వీట్

ఏపీలో ఎండలు మండిపోతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో వృద్ధులను సచివాలయాల వద్దరు రావాలని చెప్పడం దారుణం అని ఆ లేఖలో మొసలి కన్నీరు కార్చారు బాబు.

కక్కలేక, మింగలేక.. డ్యామేజీ కంట్రోల్ కోసం బాబు ట్వీట్
X

చంద్రబాబు హయాంలో వాలంటీర్ వ్యవస్థ లేదు, పెన్షన్లు తీసుకోడానికి వచ్చేవారు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో పడిగాపులు పడేవారు. పైగా ఒకటో తేదీ పెన్షన్ అనే విధానం అప్పుడు లేనే లేదు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఒకటో తేదీ ఠంచనుగా పెన్షన్ ఇంటికి తీసుకొచ్చి మరీ ఇస్తున్నారు. ఇలాంటి వ్యవస్థను తప్పుబట్టి, ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేయించి, వాలంటీర్లను మూడు నెలలపాటు విధులకు దూరం చేసి చాలా పెద్ద తప్పు చేశారు చంద్రబాబు. ఆ తప్పుని కవర్ చేసుకోడానికి ఇప్పుడు నానా తిప్పలు పడుతున్నారు. తాజాగా ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి ఓ లేఖ రాశారు. పెన్షన్లు ఇంటి వద్దకే తెచ్చి ఇవ్వాలని, ఆమేరకు వారు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలివ్వాలని సూచించారు. పైగా ఏపీలో ఎండలు మండిపోతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో వృద్ధులను సచివాలయాల వద్దరు రావాలని చెప్పడం దారుణం అని ఆ లేఖలో మొసలి కన్నీరు కార్చారు బాబు.



భారీ డ్యామేజ్..

ఏపీలో పెన్షన్ల వ్యవహారం కూటమికి భారీ డ్యామేజీగా మారింది. ఇంటి వద్ద పెన్షన్లు ఆగిపోడానికి ప్రధాన కారణం చంద్రబాబు అనే విషయం లబ్ధిదారులందరికీ అర్థమైంది. పైగా వాటిని ఆపేసింది మేమేనంటూ ఆదిరెడ్డి వాసు లాంటి నేతలు డప్పు కొట్టుకుంటున్నారు. పెన్షన్ల కోసం వృద్ధులు అవస్థలు పడితే, ఇన్నాళ్లూ తమకున్న సౌకర్యాన్ని ఇప్పుడు చంద్రబాబు లాగేసుకున్నారని వారు కోపం పెంచుకుంటే ఎన్నికల్లో టీడీపీ అడ్రస్ గల్లంతవడం ఖాయం. ప్రస్తుతం ఇదే పరిస్థితి ఉంది. అందుకే ఆ నెపం వైసీపీపై నెట్టేందుకు, ఈసీపై వేసేందుకు బాబు ప్రయత్నాలు మొదలు పెట్టారు. పెన్షన్ దారులందరికీ ఇళ్ల వద్దే నగదు ఇవ్వాలని ఈసీకి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. సామాజిక పెన్షన్ల పంపిణీ అనేది ప్రభుత్వ బాధ్యత అని ప్రస్తావించారు. ఆ బాధ్యతను సీఎం జగన్‌ సక్రమంగా నిర్వహించకుండా.. దురుద్దేశంతో వయోవృద్ధులు, దివ్యాంగులను అవస్థల పాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు.

ఎందుకీ మొసలి కన్నీరు..?

చంద్రబాబు హయాంలో ఒక్క నెల అయినా పెన్షన్లు ఇంటికి తీసుకెళ్లి ఇచ్చారా..? ఒక్క సారయినా ఒకటో తేదీ సక్రమంగా పెన్షన్లు పంపిణీ చేశారా..? మరి ఏ మొహం పెట్టుకుని ఇప్పుడు పెన్షన్లు ఒకటో తేదీ ఇవ్వాలి, ఇంటి దగ్గరకే వెళ్లి ఇవ్వాలని చంద్రబాబు అడుగుతున్నారు. ఇప్పటి వరకూ జగన్ పాలనలో అదే జరిగింది కదా..? నిమ్మగడ్డతో ఈసీకి ఫిర్యాదు చేయించి ఆ కార్యక్రమాన్ని ఆపడం దేనికి..? ఇప్పుడిలా ప్లాన్ రివర్స్ అయ్యే సరికి మొసలి కన్నీరు కార్చడం దేనికి..? ఈ ప్రశ్నలన్నీ టీడీపీ నేతల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎన్నికల రోజు చంద్రబాబు పెన్షన్ పాపం పండుతుందనే విషయం తేలిపోయింది.

First Published:  3 April 2024 1:52 AM GMT
Next Story