Telugu Global
Andhra Pradesh

సైకిల్ పోవాలి.. తథాస్తు..!!

ఫ్యాన్ పోవాలి, సైకిల్ రావాలి అనే ఉద్దేశంతో ప్రసంగం మొదలు పెట్టిన చంద్రబాబు ఆవేశంలో.. "గట్టిగా చెప్పండి, సైకిల్ పోవాలి" అంటూ పొలికేక పెట్టారు. అక్కడున్నవారంతా షాకయ్యారు.

సైకిల్ పోవాలి.. తథాస్తు..!!
X

బహిరంగ సభల్లో సీఎం జగన్ పేపర్ చూసి చదువుతారని, తెలుగు మాట్లాడటం ఆయనకు రాదని, అక్షర దోషాలు దొర్లుతుంటాయని టీడీపీ చాన్నాళ్లుగా విమర్శలు చేస్తోంది. జగన్ మీటింగ్ పెడితే చాలు, అందులోనుంచి ఒకటీ అరా తప్పుల్ని వెదికి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంటారు టీడీపీ కార్యకర్తలు. ఇప్పుడా అవకాశం వైసీపీకి కూడా వచ్చింది. ఏకంగా చంద్రబాబే సైకిల్ పోవాలని కోరుకున్నారు. ఇంకేముంది వైసీపీ నేతలు తథాస్తు అంటూ ఒకే ఒక్క పదంతో తేల్చేశారు.

అంబటి తథాస్తు దీవెనలు..

ఇటీవల ట్విట్టర్లో సింగిల్ వర్డ్ స్టేట్ మెంట్లు ఇస్తున్న మంత్రి అంబటి రాంబాబు.. చంద్రబాబు ఉత్తరాంధ్ర బహిరంగ సభపై కూడా సెటైర్లు పేల్చారు. ఆ సభలో చంద్రబాబు ఫ్లోలో.. సైకిల్ పోవాలి అనేశారు. ఆ తర్వాత కవర్ చేసుకున్నారు. అయితే అక్కడ ఆ పదాన్ని కట్ చేసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు అంబటి. తథాస్తు అంటూ ట్వీట్ చేశారు. అప్పటికే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.


ఫ్యాన్ పోవాలి, సైకిల్ రావాలి అనే ఉద్దేశంతో ప్రసంగం మొదలు పెట్టిన చంద్రబాబు ఆవేశంలో.. "గట్టిగా చెప్పండి, సైకిల్ పోవాలి" అంటూ పొలికేక పెట్టారు. అక్కడున్నవారంతా షాకయ్యారు. వాహనంపై చంద్రబాబు వెనక ఉన్నవారు కూడా ఒక్క క్షణం అయోమయానికి గురయ్యారు. వెంటనే చంద్రబాబు సారీ అంటూ సర్దిచెప్పుకున్నారు. కానీ లైవ్ లో వచ్చేసింది కదా, దాన్ని వైసీపీ నేతలు హైలెట్ చేస్తున్నారు. సైకిల్ పోవాలి అంటూ చంద్రబాబే స్వయంగా కోరుకుంటున్నారని, అదే నెరవేరుతుందని, తథాస్తు దేవతలు కూడా అదే దీవెన ఇచ్చారని సెటైర్లు పేలుస్తున్నారు. బొబ్బిలిలో చంద్రబాబు పర్యటనకు భారీగా జనాలు వచ్చారని, వారంతా వైసీపీపై ఆగ్రహంతో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో టీడీపీదే విజయం అంటూ అనుకూల మీడియా ఆల్రడీ ప్రచారం మొదలు పెట్టింది. 2019లో కూడా ఇలాగే చంద్రబాబు ప్రచారం జరిగిందని, కానీ చివరకు 23 సీట్లకే పరిమితమయ్యారని వైసీపీ అనుకూల మీడియా కౌంటర్లు ఇస్తోంది.

First Published:  24 Dec 2022 2:22 AM GMT
Next Story