Telugu Global
Andhra Pradesh

బాబు భాగ్య‌న‌గ‌రికి, జ‌గ‌న్ ఢిల్లీకి.. ఏపీ రాజ‌కీయాల్లో ఏం జ‌రుగుతోంది?

సీఎం జ‌గ‌న్ ఢిల్లీ వెళ్లి ప్ర‌ధాని మోడీని క‌ల‌వ‌బోతున్నారు. రాష్ట్రానికి రావ‌ల్సిన నిధులు, ప్రాజెక్టుల‌కు సాయం వంటి వాటి గురించి ప్ర‌ధానికి విజ్ఞ‌ప్తి చేస్తార‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి.

బాబు భాగ్య‌న‌గ‌రికి, జ‌గ‌న్ ఢిల్లీకి.. ఏపీ రాజ‌కీయాల్లో ఏం జ‌రుగుతోంది?
X

బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీ వెళ్లిన చంద్ర‌బాబు ఆ పార్టీ అగ్ర‌నేత‌ల‌తో చ‌ర్చ‌ల అనంత‌రం తిరిగి హైద‌రాబాద్ రాబోతున్నారు. మ‌రోవైపు సీఎం జ‌గ‌న్ ఢిల్లీ వెళ్ల‌బోతున్నారు. ప్ర‌తిప‌క్ష నేత రెండు రోజులు మకాం వేసి చ‌ర్చ‌లు జ‌రిపి వ‌చ్చాక ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఢిల్లీ వెళుతుండ‌టంతో రాష్ట్ర రాజ‌కీయాలు వేగం పుంజుకున్న‌ట్టు క‌నిపిస్తోంది.

బీజేపీ డిమాండ్ల‌న్నింటికీ బాబు ఓకే!

బీజేపీ పొత్తుకు ఒప్పుకుంటే చాలు వాళ్లు ఏమ‌డిగినా సిద్ధం అన్న‌ట్లు చంద్రబాబు వ్య‌వ‌హార‌శైలి కనిపిస్తోంది. ఆ పార్టీ అగ్ర‌నేత‌ల కోసం అర్ధ‌రాత్రి దాకా ప‌డిగాపులు ప‌డిన టీడీపీ అధినేత వాళ్లు అడిగిన డిమాండ్ల‌న్నింటికీ, పెట్టిన ష‌ర‌తుల‌న్నింటికీ ఓకే చెప్పార‌ని పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో కామెంట్లు షికారు చేస్తున్నాయి. ఏకంగా 8 పార్ల‌మెంట్‌, 25 అసెంబ్లీ సీట్లు బీజేపీ అడుగుతోంద‌న్న వార్త‌లు ఇటు టీడీపీ, అటు జ‌న‌సేన శ్రేణుల‌ను క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి.

ప్ర‌ధానిని క‌ల‌వ‌బోతున్న సీఎం

మ‌రోవైపు సీఎం జ‌గ‌న్ ఢిల్లీ వెళ్లి ప్ర‌ధాని మోడీని క‌ల‌వ‌బోతున్నారు. రాష్ట్రానికి రావ‌ల్సిన నిధులు, ప్రాజెక్టుల‌కు సాయం వంటి వాటి గురించి ప్ర‌ధానికి విజ్ఞ‌ప్తి చేస్తార‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి. మారిన రాజ‌కీయ ప‌రిణ‌మాల నేప‌థ్యంలో చంద్ర‌బాబు బీజేపీ నేత‌ల‌ను క‌ల‌వ‌డం ప్రాధాన్యాంశంగా మారింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధానిని క‌లవ‌బోతున్న జ‌గ‌న్ ఏపీ రాజ‌కీయాల‌పై ఏం చ‌ర్చిస్తారో అన్న‌ది ఇప్పుడు పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

First Published:  9 Feb 2024 2:37 AM GMT
Next Story