Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు ట్రీట్మెంట్ కోసం జైలుకి ఇద్దరు వైద్యులు

జైలు అధికారులు లేఖ రాయడంతో రాజమండ్రి జీజీహెచ్ సూపరింటెండెంట్ వెంటనే ఓ అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ తో కూడిన వైద్య బృందాన్ని జైలుకి పంపించారు. ఆ బృందం చంద్రబాబుకి ట్రీట్మెంట్ చేసింది.

చంద్రబాబు ట్రీట్మెంట్ కోసం జైలుకి ఇద్దరు వైద్యులు
X

రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఇద్దరు స్పెషలిస్ట్ వైద్యులు వచ్చారు. ప్రత్యేకంగా చంద్రబాబు ట్రీట్మెంట్ కోసం వారిద్దర్నీ పిలిపించారు. జైలు అధికారులు, రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ కి లేఖ రాయడంతో ఆయన ఇద్దరు వైద్యుల్ని పంపించారు. ఆ వైద్యబృందం సెంట్రల్ జైలులో చంద్రబాబుకి వివిధ పరీక్షలు నిర్వహించింది. వైద్యం అందించింది.

అనారోగ్యం ఏంటి..?

చంద్రబాబుకి చర్మ సమస్య ఉందనే విషయం తెలిసిందే. ఆయనకు జైలు వాతావరణం పూర్తిగా పడకపోవడంతో ఆ సమస్య తీవ్రతరం అయింది. రాజకీయ పర్యటనలకోసం ఆయన బయటకు వచ్చినా.. కొంతసేపటి తర్వాత ప్రత్యేక వాతావరణ ఏర్పాట్లలో విశ్రాంతి తీసుకుంటారు. కానీ జైలులో అలాంటి ఏర్పాట్లు ఉండవు. ఎండవేడి, ఉక్కపోత వల్ల ఆయన చర్మసంబంధిత సమస్య తీవ్రమైంది. చర్మవ్యాధి నిపుణులను పంపించాలంటూ జైలు అధికారులు లేఖ రాయడంతో రాజమండ్రి జీజీహెచ్ సూపరింటెండెంట్ వెంటనే ఓ అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ తో కూడిన వైద్య బృందాన్ని జైలుకి పంపించారు. ఆ బృందం చంద్రబాబుకి ట్రీట్మెంట్ చేసింది.

చంద్రబాబు జైలుకి వెళ్లినప్పటినుంచి కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. మొదట్లో వేడినీళ్లు లేవని, దోమలు కుడుతున్నాయని అన్నారు, తర్వాత ఆయన డీహైడ్రేషన్ కి గురయ్యారని చెప్పారు. ఇప్పుడు చర్మ సంబంధిత సమస్యకు జైలు అధికారులు చికిత్స అందించారు. జైలులో చంద్రబాబు ఆరోగ్యం విషయంలో అధికారులు కూడా అలర్ట్ గా ఉన్నారు. చంద్రబాబు వచ్చిన తర్వాత, రాజకీయ ప్రదర్శనలు, ములాఖత్ లు పెరగడంతో.. జైలు వద్ద భద్రత కూడా కట్టుదిట్టం చేశారు.

First Published:  12 Oct 2023 2:03 PM GMT
Next Story