Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు తనను తానే మోసం చేసుకుంటున్నారా?

చంద్రబాబు రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా స్ట్రైట్ పాలిటిక్స్ అన్నది లేనేలేదు. ఎంతసేపు వెన్నుపోటు రాజకీయాలు, ప్రత్యర్థుల బలహీనతలను అడ్వాంటేజ్ తీసుకుని రాజకీయం చేయటమే కనబడుతుంది.

చంద్రబాబు తనను తానే మోసం చేసుకుంటున్నారా?
X

రాజకీయాల్లో మోసాలు రెండు రకాలుగా ఉంటాయి. మొదటిది ఇతరులను మోసం చేయటం. రెండోది తనను నమ్ముకున్న వాళ్ళని మోసం చేయటం. ఇక్కడ ఇతరులు అంటే జనాలను అన్నమాట. ఏదో పద్ధ‌తిలో జనాలను మోసం చేసి ఎన్నికల సమయంలో ఓట్లేయించుకుని గెలవటం. ఇక రెండో మోసంలో తనను నమ్ముకున్న వాళ్ళని అంటే సొంత పార్టీ వాళ్ళని కూడా భ్రమల్లో నెట్టేయటం. దీనివల్ల ఏమవుతుందంటే జనాలను నాలుగు రోజులు మోసం చేయగలిగినా, పార్టీ వాళ్ళకి రెండోరోజే తెలిసిపోతుంది తమను కూడా మభ్యపెడుతున్నారని.

ఇప్పుడు ఇదంతా ఎందుకంటే చంద్రబాబునాయుడు వైఖరినే చెప్పుకోవాల్సివ‌స్తోంది. తన చెప్పుచేతల్లో ఉండే ఎల్లో మీడియా ద్వారా జనాలను మోసం చేయగలిగినంతకాలం చేశారు. ఎల్లో మీడియా మాత్రమే ఉన్న రోజుల్లో చంద్రబాబు మోసాలు బయటపడలేదు. ఎప్పుడైతే ప్రత్యర్థి మీడియా కూడా మొదలైందో మెల్లిగా చంద్రబాబు మోసాలు బయపడుతున్నాయి. దాంతో జనాల్లో ఆలోచన మొదలైంది. ఇప్పుడు నడుస్తున్నది ఎల్లో మీడియా, ప్రత్యర్థి మీడియా కాదు సోషల్ మీడియా కాలం.

దాంతో చంద్రబాబు జనాలను కాకుండా సొంత పార్టీనే మోసం చేయటం మొదలుపెట్టారు. దీనికి తాజా ఉదాహరణ ఏమిటంటే ఇండియా టుడే-సీ ఓబర్ సర్వేలో టీడీపీకి 15-20 ఎంపీ సీట్లు వస్తాయని రాయించుకోవటం. రెండు రోజులు ఆ వార్తను ఎల్లో మీడియా ప్రముఖంగా అచ్చేసింది. చంద్రబాబు కూడా దాన్నే పట్టుకుని పదేపదే మాట్లాడారు. మూడో రోజు ఏమైంది సదరు సర్వే భోగస్ అని తేలిపోయింది. భోగస్ సర్వేను తాము అచ్చేస్తున్నామని ఎల్లో మీడియాకు, తాను మాట్లాడుతున్నదంతా మోసమని చంద్రబాబుకు బాగా తెలుసు.

ఎల్లో మీడియా+చంద్రబాబు కూడబలుక్కునే జనాలను, పార్టీని మోసం చేశారు. ఇలాంటి ఫేక్ కథనాలు, మాటల వల్ల ఏం ఉపయోగమో ఎల్లో మీడియా, చంద్రబాబుకే తెలియాలి. జనాలను, పార్టీ నేతలను మోసం చేస్తున్నానని చంద్రబాబు అనుకుంటున్నారు. నిజానికి చంద్రబాబు మోసం చేస్తున్నది జనాలను, తమ్ముళ్ళని కాదు తనని తానే మోసం చేసుకుంటున్నారు. చంద్రబాబు రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా స్ట్రైట్ పాలిటిక్స్ అన్నది లేనేలేదు. ఎంతసేపు వెన్నుపోటు రాజకీయాలు, ప్రత్యర్థుల బలహీనతలను అడ్వాంటేజ్ తీసుకుని రాజకీయం చేయటమే కనబడుతుంది. రాజకీయ చరమాంకంలో కూడా దాన్నే నమ్ముకోవటమే ఆశ్చర్యంగా ఉంది.


First Published:  31 Aug 2023 6:04 AM GMT
Next Story