Telugu Global
Andhra Pradesh

తన వల్ల కాదని నిమ్మగడ్డ సాయం కోరిన చంద్రబాబు

వలంటీర్ల వ్యవస్థ‌ను రద్దు చేయాలని నిమ్మగడ్డ సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. ఎన్నికలను వలంటీర్ల వ్యవస్థ‌ ప్రభావితం చేసే కుట్ర జరుగుతోందని నిమ్మగడ్డ ఆందోళన వ్యక్తంచేశారు.

తన వల్ల కాదని నిమ్మగడ్డ సాయం కోరిన చంద్రబాబు
X

వలంటీర్ల వ్యవస్థ‌ అంటే తెలుగుదేశం పార్టీ ఎంతగా భయపడుతున్నదో అర్థ‌మైపోయింది. ఈ వ్యవస్థ‌ను రద్దు చేయాలని సిటిజన్ ఫర్ డెమక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ సుప్రీంకోర్టులో పిటీషన్ వేయటమే ఇందుకు నిదర్శనం. వలంటీర్ల వ్యవస్థ‌ను జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన దగ్గర నుండి దానికి వ్యతిరేకంగా చంద్రబాబు అండ్ కోతో పాటు ఎల్లోమీడియా ఎంత గోల చేస్తోందో? ఎన్ని ఆరోపణలు చేస్తున్నారో అందరికీ తెలిసిందే. అయితే వీళ్ళు ఎంత గోలచేసినా, ఆరోపణలు చేసినా వలంటీర్లు మాత్రం తమ పనులను తాము చేసుకుపోతున్నారు.

ఎందుకంటే జనాల్లో 2.5 లక్షల మంది వలంటీర్లంటే మంచి అభిప్రాయముంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు జనాలకు అందుతున్నది లేనిది చూడాల్సిన, అందించాల్సిన బాధ్యత వలంటీర్లపైనే ఉంది. తమ బాధ్యతల్లో వలంటీర్లు చాలావరకు సక్సెస్ అయ్యారు. అందుకనే జనాలు కూడా చాలా విషయాల్లో వీళ్ళపైనే ఆధారపడుతున్నారు. జనాలు మెచ్చిన వ్యవస్థ‌ కాబట్టే ప్రతిపక్షాల ఆరోపణలు, ఎల్లోమీడియా ఏడుపును జగన్ ఏమాత్రం లెక్కచేయటంలేదు. దాంతో రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వానికి అనుకూలంగా వలంటీర్ల వ్యవస్థ‌ పనిచేస్తే తమ గెలుపు కష్టమని చంద్రబాబుకు బాగా అర్థ‌మైపోయింది.

జనాల్లో సానుకూలంగా పాతుకుపోయిన ఈ వ్యవస్థ‌ను రద్దు చేయించకపోతే ఎన్నికల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని చంద్రబాబు అండ్ కో బాగా అర్థ‌మైపోయింది. అలాగని జనాలు సానుకూలంగా ఉన్న వ్యవస్థ‌ను రద్దు చేస్తే మొదటికే మోసం వస్తుందని భయపడ్డారు. అందుకనే తనకు సన్నిహితంగా ఉండే రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సాయం తీసుకున్నట్లు అనిపిస్తోంది.

అందుకనే వలంటీర్ల వ్యవస్థ‌ను రద్దు చేయాలని నిమ్మగడ్డ సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. ఎన్నికలను వలంటీర్ల వ్యవస్థ‌ ప్రభావితం చేసే కుట్ర జరుగుతోందని నిమ్మగడ్డ ఆందోళన వ్యక్తంచేశారు. ఆందోళనైతే వ్యక్తంచేశారు కానీ అందుకు ఆధారాలను మాత్రం చూపించలేదు. తమ కార్యకర్తలనే ప్రభుత్వం వలంటీర్లుగా నియమించింది కాబట్టి వెంటనే వలంటీర్ల వ్యవస్థ‌ను రద్దుచేయాలని నిమ్మగడ్డ కోరారు. ఈ పిటీషన్ మంగళవారం విచారణకు రాబోతోంది. నిమ్మగడ్డను అడ్డంపెట్టుకుని వలంటీర్ల వ్యవస్థ‌ రద్దుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. దీంతోనే వలంటీర్ల వ్యవస్థ‌ అంటే చంద్రబాబు అండ్ కో ఎంత భయపడుతున్నారో అర్థ‌మైపోతోంది.

First Published:  28 Nov 2023 2:15 AM GMT
Next Story