Telugu Global
Andhra Pradesh

యాగం ఇక్కడ.. నివాసం అక్కడ

చంద్రబాబు లాంటివాళ్లు ఎన్నారైలుగా ఏపీకి వస్తూ పోతూ ఉన్నారని, సార్థక నామధేయులుగా మిగిలిపోయారని ట్రోలింగ్ నడుస్తోంది.

యాగం ఇక్కడ.. నివాసం అక్కడ
X

చంద్రబాబు రాజశ్యామల యాగం పూర్తయింది.. ఇక విజయం మనదేనంటూ ఎల్లో మీడియా ఊదరగొడుతోంది. అయితే ఈ యాగం పూర్తవగానే లగేజ్ సర్దుకుని చంద్రబాబు కుటుంబం హైదరాబాద్ పయనమైంది. సహజంగా ఇలాంటి క్రతువులు పూర్తి చేసిన తర్వాత దంపతులిద్దరూ అక్కడే ఉండటం పరిపాటి. కానీ చంద్రబాబు కేవంల అధికారం కోసమే ఇక్కడ యాగం చేశారు, కానీ నివాసం హైదరాబాద్ కాబట్టి తిరిగి అక్కడికే బయలుదేరారంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఎన్నికలప్పుడు ఎన్నారైలంతా కట్టగట్టుకుని ఏపీకి వస్తున్నారంటూ సీఎం జగన్ ఇటీవల తరచూ విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. అయినా కూడా చంద్రబాబు లాంటివాళ్లు ఎన్నారైలుగా ఏపీకి వస్తూ పోతూ ఉన్నారని, సార్థక నామధేయులుగా మిగిలిపోయారని ట్రోలింగ్ నడుస్తోంది.

తనకు ఇవే చివరి ఎన్నికలని చంద్రబాబు మానసికంగా సిద్ధమైనట్టు తెలుస్తోంది. అందుకే ఆయన ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవట్లేదు. జనసేనని, బీజేపీని.. చివరకు వామపక్షాలను కూడా కలుపుకొని పోవాలనుకుంటున్నారు. గతంలో ఎప్పుడూ పొలిటికల్ స్క్రీన్ పైకి రాని కుటుంబ సభ్యుల్ని కూడా ఇప్పుడు బయటకు తెస్తున్నారు. ఓవైపు చంద్రబాబు, మరోవైపు లోకేష్ బహిరంగ సభలు నిర్వహిస్తుండగా.. భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా వివిధ కార్యక్రమాలతో జనంలోకి వెళ్తున్నారు.

భయం, దిగులు..

పైకి మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నా లోలోపల చంద్రబాబు ఎన్నికల విషయంలో భయపడుతున్నారనే విషయం తేలిపోయింది. ఇప్పటికే రాజ్యసభలో టీడీపీకి కుర్చీ లేకుండా పోయింది. ఏపీ అసెంబ్లీలో కూడా టీడీపీకి స్థానం లేకుండా చేయాలని సీఎం జగన్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ దశలో అందర్నీ కలుపుకొని యుద్ధానికి వెళ్తున్నా.. ఫలితం ఎలా ఉంటుందోననే భయం చంద్రబాబులో ఉంది. టీడీపీ మేనిఫెస్టోకి కూడా జనంలో పెద్దగా స్పందన లేదు. పైగా మేనిఫెస్టో హామీలను అమలు చేయని ముఖ్యమంత్రుల్లో చంద్రబాబుది మొదటి స్థానం అని వైసీపీ ఆధారాలతో సహా జనానికి అర్థమయ్యేలా చెబుతోంది. తాను ఏం చేశానో చెప్పుకోలేక, ఏం చేస్తాననే విషయంలో ప్రజలకు భరోసా ఇవ్వలేక ఇబ్బంది పడుతున్నారు చంద్రబాబు.

First Published:  18 Feb 2024 1:43 PM GMT
Next Story