Telugu Global
Andhra Pradesh

బాబు, పవన్ మీటింగ్.. చివరకు ఏం తేల్చారంటే..?

టీడీపీ సూపర్ సిక్స్ అంటూ ఇప్పటికే మినీ మేనిఫెస్టోని జనంలోకి తీసుకెళ్తోంది, అటు జనసేన కూడా విడిగా షణ్ముఖ వ్యూహాన్ని సిద్ధం చేసుకుంది. ఈ రెండిట్నీ కలిపి తయారు చేసిన కిచిడీని త్వరలో జనంపైకి వదలబోతున్నారని తెలుస్తోంది.

బాబు, పవన్ మీటింగ్.. చివరకు ఏం తేల్చారంటే..?
X

ఏపీలో టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో కోసం చంద్రబాబు, పవన్ కల్యాణ్ మరోసారి భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటికి తొలిసారి పవన్ రావడం ఈ భేటీ విశేషం. అంతకు మించి ఇందులో ఇరు పార్టీలు ఆశించడానికి ఏమీ లేదు. ఈ మీటింగ్ తర్వాత కూడా ఇరు పార్టీలనుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అంటే భేటీ సారాంశాన్ని బయటకు చెప్పడానికి ఎవ్వరూ ఇష్టపడలేదన్నమాట. ఇక ఎల్లో మీడియా ఊహాగానాల విషయానికొస్తే ఈ భేటీలో మేనిఫెస్టోపై చర్చ జరిగిందని, సీట్ల సర్దుబాటుపై కూడా చర్చించారని అంటున్నారు.


సూపర్ సిక్స్ ప్లస్ షణ్ముఖ వ్యూహం..

టీడీపీ సూపర్ సిక్స్ అంటూ ఇప్పటికే మినీ మేనిఫెస్టోని జనంలోకి తీసుకెళ్తోంది, అటు జనసేన కూడా విడిగా షణ్ముఖ వ్యూహాన్ని సిద్ధం చేసుకుంది. ఈ రెండిట్నీ కలిపి తయారు చేసిన కిచిడీని త్వరలో జనంపైకి వదలబోతున్నారని తెలుస్తోంది. ఉమ్మడి మేనిఫెస్టోలో ఆసక్తికర అంశాలుంటాయా..? లేక కర్నాటక, తెలంగాణలో కాంగ్రెస్ మేనిఫెస్టోల నుంచి కొన్ని అంశాలను, ఇతర రాష్ట్రాలనుంచి మరికొన్నిటిని జతచేసి, పేర్లు మార్చి ప్రకటిస్తారా అనేది తేలాల్సి ఉంది.

ఇదే నెలలో మేనిఫెస్టో..

ఓవైపు సీఎం జగన్ ఇన్ చార్జ్ ల లిస్ట్ లు విడుదల చేస్తూ స్పీడుమీదున్నారు. టీడీపీ-జనసేన మాత్రం ఇంకా ఆ సాహసం చేయలేదు. వైసీపీనుంచి వచ్చే అసంతృప్తులందరికీ ఛాన్స్ లు ఇవ్వాలనే ఉద్దేశంతో చంద్రబాబు వేచి చూస్తున్నారు. పవన్ కూడా ఇంకా బేరాలాడుతున్నట్టే అర్థమవుతోంది. అందుకే సీట్ల లెక్క తేలలేదు. దీనికంటే ముందే మేనిఫెస్టో విడుదల చేయాలని వారు అనుకుంటున్నారు. ఈ నెలలో మేనిఫెస్టో ప్రకటించి, వచ్చే నెలనుంచి అభ్యర్థుల లిస్ట్ లు విడుదల చేయాలని అనుకుంటున్నారట చంద్రబాబు, పవన్ కల్యాణ్. ఉమ్మడి ప్రచార సభలు, ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై కూడా తాజా భేటీలో చర్చలు జరిగినట్టు చెబుతున్నారు.

First Published:  14 Jan 2024 12:31 AM GMT
Next Story