Telugu Global
Andhra Pradesh

పట్టాభిని టీడీపీ వదిలేసినట్లేనా?

నాలుగు రోజులుగా రాజమండ్రి జైలులో ఉన్నప్పటికీ పట్టాభిని చూడటానికి పార్టీ తరపున ఒక్కరంటే ఒక్కనేత కూడా వెళ్ళలేదు. కారణం ఏమిటంటే పట్టాభిపై చంద్రబాబునాయుడు మండిపోతున్నారట. పార్టీని అనవసరంగా వివాదాల్లోకి లాగి కంపు చేస్తున్నారనే ఫీడ్ బ్యాక్ వచ్చిందట.

పట్టాభిని టీడీపీ వదిలేసినట్లేనా?
X

అతిచేస్తే గతిచెడుతుందనే సామెతలో చెప్పినట్లుగా తయారైంది టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పరిస్థితి. గన్నవరం పార్టీ ఆఫీసు విధ్వంసం కేసులో అరెస్టయిన ఈ నేత రిమాండ్‌పై ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉన్నారు. నాలుగు రోజులుగా రాజమండ్రి జైలులో ఉన్నప్పటికీ పట్టాభిని చూడటానికి పార్టీ తరపున ఒక్కరంటే ఒక్కనేత కూడా వెళ్ళలేదు. కారణం ఏమిటంటే పట్టాభిపై చంద్రబాబునాయుడు మండిపోతున్నారట. పార్టీని అనవసరంగా వివాదాల్లోకి లాగి కంపు చేస్తున్నారనే ఫీడ్ బ్యాక్ వచ్చిందట.

అందుకనే పట్టాభి గురించి ఎవరూ పట్టించుకోవద్దని సమావేశంలో తమ్ముళ్ళకు చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. ఒకవైపు లోకేష్ పాదయాత్రలో ఉండగా మీడియా అటెన్షన్ మొత్తం నాలుగు రోజుల పాటు గన్నవరం పార్టీ ఆఫీసు, పట్టాభిపైనే ఫోకస్ అయ్యిందని తమ్ముళ్ళు చంద్రబాబుకు చెప్పారట. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డిని అమ్మనాబూతులు తిట్టినప్పుడు కూడా మంగళగిరిలోని పార్టీ ఆఫీసుపై జరిగిన దాడిని గుర్తుచేశారట. అప్పుడైనా, ఇప్పుడైనా పట్టాభి నోటిదురుసు కారణంగానే పార్టీ ఆఫీసులపై దాడి జరిగిన విషయాన్ని వివరించారని సమాచారం.

పైగా రెండు ఘటనల్లోనూ టీడీపీనే గబ్బుపట్టిందని, పట్టాభి నోటిదురుసును ఎవరు సమర్ధించని విషయాన్ని కూడా కొందరు తమ్ముళ్ళు అధినేతకు చెప్పారట. గన్నవరంలో తాను పోటీచేయబోతున్నట్లు తనంతట తానుగానే పట్టాభి ప్రకటించేసుకున్న విషయాన్ని కూడా చంద్రబాబుకు గుర్తుచేశారు. అందుకనే వెంటనే నియోజకవర్గానికి సమన్వయకర్తగా మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణను చంద్రబాబు నియమించారు.

చంద్రబాబు, లోకేష్‌కు తాను అత్యంత సన్నిహితుడిని అనే కలరింగ్ ఇచ్చుకుంటు కొందరు నేతలను చులకనగా మాట్లాడుతున్నారని ఫిర్యాదుచేశారట. అలాగే పార్టీ పేరు చెప్పుకుని అమెరికా లాంటి దేశాల్లో పర్యటించినప్పుడు పట్టాభి ఎలా లాభపడ్డారనే విషయాన్ని కూడా వివరించారట. ఇంతకాలం పట్టాభిపైన పేరుకుపోయిన కసిని ఇప్పుడు తమ్ముళ్ళు చంద్రబాబు ముందు కక్కేశారు. తమ్ముళ్ళ ఫీడ్ బ్యాక్ తర్వాత పట్టాభిని దూరంగా పెట్టమని ఆదేశించారట. అందుకనే గన్నవరం విధ్వంసం-ప్రజలకు బహిరంగలేఖ అని చంద్రబాబు రాసిన నాలుగు పేజీల లేఖలో ఒక్కచోట కూడా పట్టాభి ప్రస్తావన లేదు. దీంతోనే అర్థ‌మైపోయింది పట్టాభిని టీడీపీ వదిలేసిందని.

First Published:  28 Feb 2023 5:30 AM GMT
Next Story