Telugu Global
Andhra Pradesh

ష్యూరిటీ బాండ్లా...ఎవరైనా నమ్ముతారా?

ష్యూరిటీ బాండ్లంటే ఏమీలేదు పార్టీ తరపున ఇచ్చే హామీ బ్రోచర్ మాత్రమే. ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ’ అనే పేరుతో ఒక ప్రోగ్రామ్ నిర్వహించబోతున్నారు.

ష్యూరిటీ బాండ్లా...ఎవరైనా నమ్ముతారా?
X

జనాలను నమ్మించేందుకు చంద్రబాబునాయుడు నానా తంటాలు పడుతున్నారు. ఒకవైపు జగన్‌పై ఆరోపణలు, విమర్శలు చేస్తునే మరోవైపు ఇచ్చిన మాటకు తాను కట్టుబడి ఉండే వ్యక్తినని జనాలను నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ష్యూరిటీ బాండ్లను విడుదల చేశారు. ష్యూరిటీ బాండ్లంటే ఏమీలేదు పార్టీ తరపున ఇచ్చే హామీ బ్రోచర్ మాత్రమే. ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ’ అనే పేరుతో ఒక ప్రోగ్రామ్ నిర్వహించబోతున్నారు. అందులో బాబు ష్యూరిటీ పేరుతో తయారు చేసిన బ్రోచర్లను విడుదల చేశారు.

ఇక్కడ విషయం ఏమిటంటే చంద్రబాబు ఎన్నిరూపాల్లో బ్రోచర్లను విడుదల చేసినా ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఇచ్చిన మాట మీద నిలబడటంలో చంద్రబాబుకున్న ఇమేజ్‌ అలాంటిది మరి. 1995-2003 మధ్య చంద్రబాబు పాలన ఎలాగుందన్నది అవసరంలేదు. 2014-19 మధ్య చంద్రబాబు పాలనను గమనిస్తే చాలు ఇచ్చిన హామీలను ఎంతవరకు నిలబెట్టుకుంటారన్నది అర్థ‌మైపోతుంది. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఎన్ని సంపూర్ణంగా అమలు చేశారో చంద్రబాబు చెబితే చాలు.

ఒక్కటంటే ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. పైగా మ్యానిఫెస్టోను పార్టీ వెబ్ సైట్ నుండి ఎత్తేశారు కూడా. ఎందుకంటే జనాలెవరైనా వెబ్ సైట్ చూస్తే తానిచ్చిన హామీలు గుర్తుకొస్తాయేమోనని. అధికారం కోసం హామీలను ఇవ్వటం వచ్చిన తర్వాత వాటిని గాలికి వదిలేయటంలో చంద్రబాబును మించిన నేత దేశంలోనే లేరని చాలాసార్లు రుజువైంది. ఇలాంటి వ్యక్తి రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావటం కోసం ష్యూరిటీ బాండ్లు, భవిష్యత్తుకు గ్యారెంటీ అని అంటే ఎంత మంది నమ్ముతారు?


సెప్టెంబర్ 1వ తేదీ నుండి మొదలయ్యే ఈ కార్యక్రమంలో 3 కోట్ల మంది ఓటర్లను కలవాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఈ ఓటర్ల వివరాలన్నింటిని నమోదు చేసుకోవటం కోసం ప్రత్యేకంగా యాప్ కూడా రెడీ చేయించారు. వీటిని కుటుంబ సారధుల ద్వారా అమల్లోకి తేబోతున్నారు. ఎన్నికల్లో ఇచ్చే మ్యానిఫెస్టోకే దిక్కుండదు. ఇక మామూలు హామీలను చంద్రబాబు నిలుపుకుంటారా? మొత్తానికి జనాలను నమ్మించేందుకు చాలా అవస్థ‌లే పడుతున్నారు. మరి ఎంతవరకు వర్కవుటవుతుందో చూడాల్సిందే. ప్రోగ్రామ్ మొదలుపెట్టి జనాల్లోకి వెళ్ళినపుడు అర్థ‌మైపోతుంది కదా.


First Published:  27 Aug 2023 5:02 AM GMT
Next Story