Telugu Global
Andhra Pradesh

విదేశాలకు చంద్రబాబు.. రహస్యంగా టూర్ వివరాలు!

చంద్రబాబు ఎక్కడికి వెళ్తున్నారనే విషయాన్ని ఎల్లో మీడియా, టీడీపీ రహస్యంగా ఉంచాయి. విశ్రాంతి కోసం చంద్రబాబు విదేశాలకు వెళ్తున్నారంటూ ఎల్లోమీడియా రాసుకొచ్చింది.

విదేశాలకు చంద్రబాబు.. రహస్యంగా టూర్ వివరాలు!
X

ఏపీలో ఎన్నికలు ముగిశాయి. దాదాపు 2, 3 నెలలుగా ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపిన నేతలు రాజకీయాలకు కాస్త విరామం ఇచ్చి సేద తీరుతున్నారు. ఇప్పటికే వైసీపీ అధినేత, సీఎం జగన్‌ ఫ్యామిలీతో గడిపేందుకు లండన్‌ వెళ్లిన విషయం తెలిసిందే. ఇక ఇవాళ తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా విదేశాలకు వెళ్తారని తెలుస్తోంది.

అయితే చంద్రబాబు ఎక్కడికి వెళ్తున్నారనే విషయాన్ని ఎల్లో మీడియా, టీడీపీ రహస్యంగా ఉంచాయి. విశ్రాంతి కోసం చంద్రబాబు విదేశాలకు వెళ్తున్నారంటూ ఎల్లోమీడియా రాసుకొచ్చింది. చంద్రబాబు దాదాపు 6 రోజుల పాటు విదేశాల్లో గడపనున్నారని తెలుస్తోంది. ఆరు రోజుల తర్వాత ఆయన రాష్ట్రంలో అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే నారా లోకేశ్, ఆయన సతీమణి బ్రాహ్మణితో కలిసి ఫారిన్ వెళ్లిపోయారు. ఈ వివరాలు కూడా బయటకు రాలేదు.

జగన్‌ విదేశీ పర్యటనపై అక్కసు!

ఇక ఎప్పటిలాగే సీఎం జగన్‌ విదేశీ పర్యటనపై తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడియా అక్కసు వెళ్లగక్కాయి. ఓటమి భయంతో జగన్‌ గ్యాంగ్‌ పారిపోతున్నారంటూ తెలుగుదేశం ట్వీట్‌లు చేసింది. జగన్‌ విహారాలకు వెళ్తున్నారంటూ ఎల్లో మీడియా రాసుకొచ్చింది. కానీ చంద్రబాబు విదేశీ పర్యటనపై మాత్రం టీడీపీ ఎలాంటి ట్వీట్‌ చేయకుండా గోప్యంగా ఉంచింది. ఇక ఎల్లో మీడియా సైతం చంద్రబాబు విదేశీ పర్యటనను హైలైట్‌ చేయలేదు.

First Published:  19 May 2024 3:02 AM GMT
Next Story