Telugu Global
Andhra Pradesh

28 సీట్లు ఫైనల్.. ఆలోచించుకో పవన్!

ఎలాగోలా చేసి 35 ఫైనల్ చేయాలని పవన్ కల్యాణ్ అభ్యర్థించినప్పటికీ అది అయ్యేపని కాదని బాబు తేల్చేశారని టాక్. అలాగే జనసేనకు కేవలం 3 ఎంపీలు మాత్రమే ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది.

28 సీట్లు ఫైనల్.. ఆలోచించుకో పవన్!
X

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మరోసారి షాకిచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. 50కి పైగా ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేస్తామని జనసైనికులు కలలు గన్నారు. పవన్‌ కూడా అదే ఊహల్లో తేలిపోయారు. కానీ, జనసేన ఆశలపై చంద్రబాబు మరోసారి నీళ్లు చల్లారు. 50 లేదు ఏం లేదు, 28 సీట్లు ఫైనల్.. ఆలోచించుకో అంటూ పవన్‌కి అల్టిమేటం ఇచ్చారు. చంద్రబాబు నాయుడును ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిసి సీట్ల సర్దుబాటుపై చర్చించారు పవన్ కల్యాణ్. గత నెల 13న ఇద్దరు నేతలు చివరిసారిగా భేటీ అయ్యారు. తాజా భేటీలో అభ్యర్థుల ప్రకటన, మేనిఫెస్టో తదితర కీలక అంశాలపై చర్చించారు. 3 గంటల పాటు మంతనాలు సాగాయి.

50 కాదు, 40 కాదు కనీసం 35 ఎమ్మెల్యే సీట్లయినా తమకు కేటాయించాలని చంద్రబాబును పవన్ కోరినట్లు తెలిసింది. కానీ, చంద్రబాబు అందుకు ఒప్పుకోలేదని సమాచారం. లాస్ట్‌ 28 వరకు ఇస్తామని చంద్రబాబు చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎలాగోలా చేసి 35 ఫైనల్ చేయాలని పవన్ కల్యాణ్ అభ్యర్థించినప్పటికీ అది అయ్యేపని కాదని బాబు తేల్చేశారని టాక్. అలాగే జనసేనకు కేవలం 3 ఎంపీలు మాత్రమే ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది. ఆ 3 ఎంపీ సీట్లకే పవన్‌ కూడా ఖుషీ అయినట్లు తెలుస్తోంది.

అలాగే ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి పర్యటనలపైనా ఇద్దరు నేతలు చర్చించారు. ఇద్దరు కలిసి భారీ బహిరంగ సభల్లో పాల్గొనేలా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలని నిర్ణయించారు. బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా అనేది పవన్‌ ఢిల్లీ పర్యటన తర్వాత తెలుస్తుంది. అప్పుడే సీట్లపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈనెల 10తరవాత ఢిల్లీ వెళ్లనున్నారు పవన్ కళ్యాణ్. పవన్ ఢిల్లీ పర్యటన తర్వాత అన్నింటిపై పూర్తి స్పష్టత వస్తుంది. ఆనాడు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో బాబును పరామర్శించి బయటకు వచ్చి ఆవేశంగా పొత్తును కన్ఫర్మ్ చేసిన పవన్.. ఇప్పుడు ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. అలాగే టీడీపీ వ్యవహారంపై జనసైనికులు తీవ్ర నిరాశలో ఉన్నారు. కనీసం పొత్తు ధర్మం పాటించకపోగా, సీట్ల కేటాయింపులో మరీ అవమానకరంగా వ్యవహరిస్తోందంటూ లోలోపల కుమిలిపోతున్నారు.

First Published:  4 Feb 2024 1:32 PM GMT
Next Story