Telugu Global
Andhra Pradesh

చంద్రబాబుకు కొత్త క‌ష్టం

తాజాగా జరిగిన పరిణామం ఏమింటే సీమెన్స్ కంపెనీ ప్రతినిధి చంద్రకాంత్ షా అప్రూవర్‌గా మారిపోయారు. నిజానికి స్కామ్ జరిగిందే సీమెన్స్ కంపెనీ పేరుతో. ఆ కంపెనీతో ఎలాంటి సంబంధం లేకపోయినా కంపెనీ పేరు ఉపయోగించుకుని రూ. 371 కోట్ల కుంభకోణానికి చంద్రబాబు పాల్పడ్డారన్నది సీఐడీ ఆరోపణ.

చంద్రబాబుకు కొత్త క‌ష్టం
X

స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు మెడకు ఉచ్చు బిగుసుకుంటోందా? అవుననే అనిపిస్తోంది. ఈ కేసులో అరెస్టయి 53 రోజులు రిమాండులో ఉన్న చంద్రబాబు ప్రస్తుతం మెడికల్ బెయిల్‌పై బయటున్నారు. తాజాగా జరిగిన పరిణామం ఏమింటే సీమెన్స్ కంపెనీ ప్రతినిధి చంద్రకాంత్ షా అప్రూవర్‌గా మారిపోయారు. నిజానికి స్కామ్ జరిగిందే సీమెన్స్ కంపెనీ పేరుతో. ఆ కంపెనీతో ఎలాంటి సంబంధం లేకపోయినా కంపెనీ పేరు ఉపయోగించుకుని రూ. 371 కోట్ల కుంభకోణానికి చంద్రబాబు పాల్పడ్డారన్నది సీఐడీ ఆరోపణ. కంపెనీకి సంబంధం లేకపోయినా అవసరానికి చంద్రకాంత్‌ను తమతో కలుపుకున్నారట. డిసెంబర్ 5న చంద్రకాంత్ షా కోర్టు విచారణలో చెప్పబోయే వివరాలు చాలా కీలంగా మారబోతున్నట్లు అనిపిస్తోంది.

సీఐడీ ఆరోపణలను చంద్రబాబు అండ్ కో కొట్టేస్తున్నప్పటికీ ఆధారాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. తాజాగా స్కామ్‌లోని రూ.371 కోట్లల్లో రూ.66 కోట్లు టీడీపీ ఖాతాలోనే డిపాజిట్ అయినట్లు సీఐడీ గుర్తించింది. చెన్నప్ప అనే వ్యక్తి ద్వారా సుమన్ బోస్‌కు డబ్బు అందింది. వాళ్ళమధ్య కోడ్ భాషలో వ్యవహారాలన్నీ జరిగినట్లు గుర్తించింది. ఆ తర్వాత హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ లో ఉన్న నాలుగు బ్యాంకుల్లో రూ. 65.86 కోట్ల జమయ్యాయి. ఆ డబ్బంతా టీడీపీ ఖాతాల్లోనే జమయ్యాయి.

2016లో పెద్ద నోట్ల రద్దు సమయంలో డబ్బు మొత్తం రద్దయిన పెద్ద నోట్ల రూపంలోనే జమైనట్లు సీఐడీ గుర్తించింది. ఈ విషయాలను సుమన్ బోస్ సీఐడీ విచారణలో పూసగుచ్చినట్లు చెప్పారట. బ్యాంక్ ఆఫ్ బరోడాలోని మూడు టీడీపీ ఖాతాల్లో రూ.4 కోట్లు, రూ.25 కోట్లు, రూ.2 కోట్లు చొప్పున డిపాజిట్ అయ్యాయి. అలాగే యూనియన్ బ్యాంకు ఖాతాలో మరో రూ.33 కోట్లు జమైనట్లు సీఐడీ గుర్తించింది. ఇదే విషయాన్ని గురువారం జరిగిన విచారణలో సీఐడీ లాయర్ పొన్నవోలు సుధాకరరెడ్డి కోర్టుకు వివరించారు.

అక్రమ మార్గంలో భారీ ఎత్తున టీడీపీ ఖాతాలో డబ్బుపడిన విషయాన్ని పొన్నవోలు ఆధారాలతో సహా జడ్జి ముందుంచారు. అందుకనే అంత డబ్బు పార్టీ ఖాతాల్లో ఎలా జమైందన్న విషయమై విచారణ జరపాలని సీఐడీ ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అయితే దీనికి టీడీపీ అంగీకరించటంలేదని కూడా చెప్పారు. స్కామ్‌లో దోచుకున్న డబ్బంతా హవాలా రూపంలోనే టీడీపీ ఖాతాలో జమైందన్నారు. టీడీపీ కోశాధికారి, ఆడిటర్ తదితరులు విచారణకు హాజరై పార్టీ ఖాతాబ‌వివరాలను తీసుకొస్తే దొరికిపోతామన్న భయంతోనే తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పొన్నవోలు ఆరోపించారు. మరి కోర్టు ఏమంటుందో చూడాలి.


First Published:  17 Nov 2023 4:34 AM GMT
Next Story