Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు కంటి ఆపరేషన్ సక్సెస్ కావాలి.. వైసీపీ మంత్రి ట్వీట్

ఈ రోజు మాత్రం ఆయన ట్వీట్ లో వ్యంగ్యం కనిపించలేదు. చంద్రబాబు కంటి ఆపరేషన్ సక్సెస్ కావాలంటూ ఆయన భగవంతుడ్ని ప్రార్థించారంతే.

చంద్రబాబు కంటి ఆపరేషన్ సక్సెస్ కావాలి.. వైసీపీ మంత్రి ట్వీట్
X

చంద్రబాబు కంటి ఆపరేషన్ సక్సెస్ కావాలి.. వైసీపీ మంత్రి ట్వీట్

చంద్రబాబు పది కాలాలపాటు చల్లగా ఉండాలంటూ ఇటీవల మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. వైసీపీలో ఉంటూ చంద్రబాబు బాగు కోరుకోవడం అభినందించదగిన విషయమే. ఇప్పుడు మరో మంత్రి కూడా బొత్స మార్గాన్నే ఫాలో అయ్యారు. చంద్రబాబు కంటి ఆపరేషన్ విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. వాస్తవానికి ఎల్లో మీడియా కూడా ఈ రోజు చంద్రబాబు కంటి ఆపరేషన్ అంటూ పెద్ద ఎత్తున ఎలివేషన్లు ఇవ్వలేదు. కానీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ తర్వాతే ఈ రోజు ఆయనకు ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో ఆపరేషన్ జరుగుతున్న విషయం మరింత మందికి తెలిసింది.


అనారోగ్యం కారణంగా చూపించి చంద్రబాబు 4వారాలపాటు మధ్యంతర బెయిల్ పొందారు. ఆ తర్వాత ఆయన ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఏఐజీ ఆస్పత్రికి సాధారణ చికిత్స కోసం వెళ్లారు, ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి శుక్లం ఆపరేష్ కోసం వెళ్లారు. ఇప్పటికే ఓసారి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ఈ రోజు ఆయనకు ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో కంటి ఆపరేషన్ జరుగుతోంది. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ వేశారు. హైదరాబాద్ లో బాబు కంటి ఆపరేషన్ విజయవంతంగా పూర్తి కావాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని చెప్పారు.

గతంలో కూడా అంబటి రాంబాబు చంద్రబాబు కంటి చూపుపై ట్విట్టర్లో సెటైర్లు పేల్చారు.

నిజం గెలిచి కాదు

బాబుకు కళ్ళు కనిపించడం లేదు అని మధ్యంతర బెయిల్!

వస్తున్నా......మీ కోసం కాదు!

వస్తున్నా కంటి ఆపరేషన్ కోసం !

విజనరీ లీడర్ కి

విజన్ సరిచేసుకోమని బెయిల్ ఇచ్చారు !

కడిగిన ముత్యంలా వస్తాడన్నారు

కంటి ఆపరేషన్ కే వచ్చాడు !


అంటూ వరుసగా ట్విట్టర్లో ఎగతాళి చేస్తూ ట్వీట్లు వేశారు అంబటి. ఈరోజు మాత్రం ఆయన ట్వీట్ లో వ్యంగ్యం కనిపించలేదు. చంద్రబాబు కంటి ఆపరేషన్ సక్సెస్ కావాలంటూ ఆయన భగవంతుడ్ని ప్రార్థించారంతే. అయితే సోషల్ మీడియాలో ఇది కూడా సెటైర్ గానే పేలుతోంది.

First Published:  7 Nov 2023 9:07 AM GMT
Next Story