Telugu Global
Andhra Pradesh

తప్పంతా చనిపోయిన వాళ్ళదేనా? ప్రాణ త్యాగమా?

ఇతర జిల్లాల్లోని తన పర్యటనల్లో జనాలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నట్లుగానే కందుకూరులో కూడా హాజరైనట్లు చెప్పారు. చనిపోయిన 8 మంది ప్రాణ త్యాగం చేసినట్లు చెప్పటమే విచిత్రంగా ఉంది. పైగా ‘కొన్ని సంఘటనలు మన చేతుల్లో ఉండవు` అని వేదాంతం కూడా వినిపించారు.

తప్పంతా చనిపోయిన వాళ్ళదేనా? ప్రాణ త్యాగమా?
X

కొందరు తమ్ముళ్ళ అత్యుత్సాహం వల్లే ప్రమాదం జరిగి 8 మంది చనిపోయారా? జరిగిన ప్రమాదంపై చంద్రబాబు నాయుడు తేల్చేసింది ఇదే. నెల్లూరు జిల్లా కందుకూరు బహిరంగ సభ కాస్త చివరకు సంతాప సభగా మారిపోయింది. బహిరంగ సభ మొదలుకాగానే జరిగిన తొక్కిసలాటలో సుమారు 13 మంది పక్కనే ఉన్న ఓపెన్ డ్రైనేజిలో పడిపోయారు. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోగా మిగిలిన వాళ్ళు దెబ్బలతో ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నారు. జరిగిన ఘటనపై సంతాప సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. కొందరు తమ్ముళ్ళ అత్యుత్సాహం వల్లే ప్రమాదం జరిగినట్లు చెప్పారు.

తాను మొదటి నుండి తమ్ముళ్ళకు అత్యుత్సాహం వద్దని, షెడ్డు మీద నుండి దిగమని చెబుతున్నా ఎవరూ వినలేదన్నారు. షెడ్డు మీద నుండి కిందున్న వాళ్ళమీద జనాలు పడటంతోనే తొక్కిసలాట జరిగిందన్నారు. ఇతర జిల్లాల్లోని తన పర్యటనల్లో జనాలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నట్లుగానే కందుకూరులో కూడా హాజరైనట్లు చెప్పారు. చనిపోయిన 8 మంది ప్రాణ త్యాగం చేసినట్లు చెప్పటమే విచిత్రంగా ఉంది. పైగా 'కొన్ని సంఘటనలు మన చేతుల్లో ఉండవు` అని వేదాంతం కూడా వినిపించారు.

ఎమోషనల్‌గా ఉన్నపుడు, సంఘీభావం తెలియజేయాలని అనుకున్నపుడు కొన్ని సంఘటనలు జరుగుతుంటాయని తేల్చేశారు. తన కార్యక్రమంలో ప్రమాదం జరిగి 8 మంది చనిపోతే వాళ్ళది ప్రాణ త్యాగంమని చెప్పేశారు. కొన్ని సంఘటనలు జరుగుతుంటాయని, కొన్ని ఘటనలు మనచేతుల్లో ఉండవని చాలా తేలిగ్గా తప్పించుకున్నారు. ఇలాంటి ప్రమాదమే జగన్మోహన్ రెడ్డి కార్యక్రమంలో జరిగినపుడు ప్రభుత్వం చేసిన హత్యగా ఎంత గోల చేశారో చూసిందే.

ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో కొందరు చనిపోవటంపై అప్పట్లో చంద్రబాబు ఎంత రచ్చ చేశారో అందరికీ తెలిసిందే. ప్రభుత్వం చేసిన హత్యంటూ అప్పట్లో గోలగోల చేశారు. తన హయాంలో గోదావరి పుష్కరాల్లో 32 మంది తొక్కిసలాటలో చనిపోయినపుడు కూడా 'ప్రమాదంలో చనిపోతుంటారో దానికి ఏం చేస్తాం..రోడ్డు ప్రమాదాల్లో చనిపోవటం లేదా' అని ఎదురు ప్రశ్నించిన గొప్పోడు చంద్రబాబు. తాను పాల్గొన్న కార్యక్రమంలో ఎవరైనా చనిపోతే ప్రమాదం..జగన్ కార్యక్రమంలో ఎవరైనా చనిపోతే మాత్రం ప్రభుత్వ హత్యంటారు. మొత్తానికి ఇప్పుడు చనిపోయిన వాళ్ళు కూడా వాళ్ళ తప్పు వల్లే చనిపోయారని చంద్రబాబు తేల్చేశారు.

First Published:  29 Dec 2022 6:49 AM GMT
Next Story