Telugu Global
Andhra Pradesh

ఇంటర్మీడియట్ - ఇంజినీర్ - బైపీసీ

అప్పుడెప్పుడో టీడీపీ నేత జలీల్ ఖాన్.. బీకామ్ లో ఫిజిక్స్ అంటూ బాగా పాపులర్ అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు.. ఇంటర్లో ఇంజినీరింగ్, ఇంజినీరింగ్ కోసం బైపీసీ అంటూ హైలెట్ అయ్యారు.

ఇంటర్మీడియట్ - ఇంజినీర్ - బైపీసీ
X

విజన్ -2020 అయిపోయింది. ఆలోపు అద్భుతాలేవీ జరగలేదు. ఒకవేళ భవిష్యత్తులో ఎవరైనా ఇలాంటి విజన్లు చెప్పినా అప్పుడు కూడా అద్భుతాలేవీ జరగబోవనే ఓ క్లారిటీ కూడా ఇచ్చేసింది విజన్-2020. ఇప్పుడు చంద్రబాబు విజన్-2047 అంటున్నారు. ఇండియా - ఇండియన్స్ - తెలుగూస్ పేరుతో విజన్ 2047 డాక్యుమెంట్ ను విశాఖలో ఆయన విడుదల చేశారు. విశాఖలో విజన్ 2047 డాక్యుమెంటరీ ఆవిష్కరణ కార్యక్రమంలో చంద్రబాబు మాటలు అందరి దృష్టినీ ఆకర్షించాలని అనుకున్నారు టీడీపీ నేతలు. కానీ అంతకు మించి అన్నట్టుగా ఆయన మాటలు వైరల్ గా మారాయి.


ఇదీ చంద్రబాబు విజన్ అంటూ వైసీపీ విపరీతంగా ట్రోల్ చేస్తోంది. అసలు ఇంటర్మీడియట్ లో ఇంజినీర్ కావాలంటే బైపీసీ చేయాలని చంద్రబాబు చెప్పడంతో ఆయన వైసీపీకి దొరికిపోయారు. ఇంటర్లో ఇంజినీరింగ్ ఏంటి..? ఇంజినీరింగ్ కి బైపీసీకి సంబంధం ఏంటి..? అంటూ నెటిజన్లు ఓవైపు ట్రోల్ చేస్తుంటే, మరోవైపు ఈ వీడియోని వైసీపీ విపరీతంగా వైరల్ చేస్తోంది. బాబు విజన్ ఇదీ అంటూ కామెంట్లు పెడుతోంది.

అప్పుడెప్పుడో టీడీపీ నేత జలీల్ ఖాన్.. బీకామ్ లో ఫిజిక్స్ అంటూ బాగా పాపులర్ అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు.. ఇంటర్లో ఇంజినీరింగ్, ఇంజినీరింగ్ కోసం బైపీసీ అంటూ హైలెట్ అయ్యారు. ప్రసంగాల్లో నేతలు తడబడటం సహజమే కానీ, మరీ ఇలా విజన్ -2047 అంటూ దేశానికే దిశా నిర్దేశం చేసేలా ప్రసంగం మొదలు పెట్టిన చంద్రబాబు ఇంటర్లో ఇంజినీరింగ్ అంటూ బుక్కయిపోవడం మాత్రం విశేషం. ఇవేనా మీ విజనరీ పాఠాలు..? అంటూ వైసీపీ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. టీడీపీ ఈ విషయంలో సైలెంట్ గానే ఉంది. కవర్ చేసుకోలేక తంటాలు పడుతోంది.

First Published:  16 Aug 2023 2:11 AM GMT
Next Story