Telugu Global
Andhra Pradesh

సుప్రీంకోర్టులో చంద్రబాబుకి స్వల్ప ఊరట..

ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈనెల 30న విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది. అప్పటి వరకు ఆయన్ను అరెస్ట్‌ చేయొద్దని ఆదేశించింది.

సుప్రీంకోర్టులో చంద్రబాబుకి స్వల్ప ఊరట..
X

సుప్రీంకోర్టులో చంద్రబాబుకి స్వల్ప ఊరట..

టీడీపీ అధినేత చంద్రబాబుకి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. అయితే అది ఈనెలాఖరు వరకు మాత్రమే, అది కూడా కేవలం ఫైబర్ నెట్ కేసులో మాత్రమే. ఈ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఆయన్ను ఈనెల 30వతేదీ వరకు అరెస్ట్ చేయొద్దని ఏపీ సీఐడీకి ఆదేశాలిచ్చింది.

ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈనెల 30న విచారణ చేపడతామని జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం తెలిపింది. అప్పటి వరకు ఆయన్ను అరెస్ట్‌ చేయొద్దని ఆదేశించింది.

క్వాష్ పిటిషన్ తీర్పు వాయిదా..

మరోవైపు స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసులో దాఖలైన క్వాష్ పిటిషన్ పై తీర్పును దీపావళి సెలవుల తర్వాత వెల్లడిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. తనపై ఏపీ సీఐడీ నమోదు చేసిన స్కిల్ కేసు కొట్టేయాలంటూ చంద్రబాబు పెట్టుకున్న 17-ఏ పిటిషన్‌ పై సెలవుల తర్వాత సుప్రీం తీర్పు వెలువరిస్తుంది. ఆరోగ్యకారణాలతో చంద్రబాబు ఇప్పటికే బెయిల్‌ పై ఉన్నారని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. సుప్రీంకోర్టులో కేసు ముగిసేవరకు అరెస్టు చేయబోమనే నిబంధన కొనసాగించాలని కోరారు.

First Published:  9 Nov 2023 7:41 AM GMT
Next Story