Telugu Global
Andhra Pradesh

కడప స్టీల్‌కు గనుల కేటాయింపున‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

వైఎస్‌ఆర్ స్టీల్ కార్పొరేషన్‌కు మరో రెండు గనుల కేటాయింపున‌కు ప్రయత్నాలు చేస్తున్నామని గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. కేంద్రం నుంచి అనుమతులు రాగానే ఆ రెండు గనుల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు.

కడప స్టీల్‌కు గనుల కేటాయింపున‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
X

కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న వైఎస్‌ఆర్ స్టీల్‌ కార్పొరేషన్‌కు అవసరమైన ముడి ఇనుము కేటాయింపున‌కు కేంద్రం ఆమోదముద్ర వేసింది. అనంతపురం జిల్లా డి. హిరేహల్ మండలంలోని సిద్ధాపురం తండా, అంతరాగంగమ్మ కొండ ప్రాంతాల్లో 25 హెక్టార్లలో కడప స్టీల్‌ ప్లాంట్‌కు గనులను ఏపీఎండీసీ గుర్తించింది. అక్కడి నుంచి గనులు తవ్వి ముడి ఇనుమును స్టీల్ ఫ్యాక్టరీని తరలించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో గనుల కేటాయింపున‌కు సంబంధించి గెజిట్‌ జారీ అయింది.

వైఎస్‌ఆర్ స్టీల్ కార్పొరేషన్‌కు మరో రెండు గనుల కేటాయింపున‌కు ప్రయత్నాలు చేస్తున్నామని గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. కేంద్రం నుంచి అనుమతులు రాగానే ఆ రెండు గనుల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. జమ్మలమడుగు మండలంలో 3 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. దాదాపు 25 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా దీని ద్వారా ఉపాధి లభిస్తుంది. 2019 డిసెంబర్‌లో జగన్ శంకుస్థాపన చేశారు. అయితే కరోనా కాలంగా నిర్మాణం అనుకున్నస్థాయిలో జరగలేదు. ఇటీవలే ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి.

First Published:  27 Sep 2022 7:19 AM GMT
Next Story