Telugu Global
Andhra Pradesh

ప్రతిపక్షాలకు కేంద్రం షాక్.. 47 వేల ఇళ్ళకు గ్రీన్ సిగ్నల్

అమ‌రావ‌తి ప్రాంతంలో పేద‌ల‌కు పంపిణీ చేసిన ఇళ్ళ పట్టాల్లో నిర్మాణానికి 47 వేల ఇళ్ళను ప్రత్యేక కేటగిరిగా మంజూరు చేయాలని జ‌గ‌న్ ప్ర‌భుత్వం కేంద్రాన్ని కోరింది. రాష్ట్రం నుండి ప్రతిపాదనలు అందటమే ఆలస్యం నెలరోజుల్లోనే కేంద్రం అందుకు ఓకే చెప్పేసింది.

ప్రతిపక్షాలకు కేంద్రం షాక్.. 47 వేల ఇళ్ళకు గ్రీన్ సిగ్నల్
X

సొంత పార్టీతో కలిపి ప్రతిపక్షాలన్నింటికీ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పెద్ద షాకే ఇచ్చింది. ఏ రూపంలో అంటే 47 వేల ఇళ్ళనిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం ద్వారా. విషయం ఏమిటంటే అమరావతి రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ళ పట్టాలు పంపిణీ చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా ఆర్ 5 జోన్ అనే దాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలతో పాటు మరికొందరు కోర్టులో కేసు వేశారు. అయితే కోర్టులో అనేక విచారణల తర్వాత చివరకు ఆర్ 5 జోన్ ఏర్పాటులో తప్పేమీలేదని తీర్పిచ్చింది.

పేదలకు ఇళ్ళ పట్టాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం అనుకుంటే ఎవరు అడ్డుకోనేందుకు లేదని హైకోర్టు చెప్పింది. అయితే ఇళ్ళ పట్టాలం పంపిణీ అన్నది అంతిమతీర్పుకు లోబడే ఉండాలని కూడా స్పష్టంగా చెప్పింది. షరతులతో అయినా సరే కోర్టు తీర్పు అనుకూలంగా రావటమే ఆలస్యం జగన్ వెంటనే కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. పంపిణీ చేసిన ఇళ్ళ పట్టాల్లో నిర్మాణానికి 47 వేల ఇళ్ళను ప్రత్యేక కేటగిరిగా మంజూరు చేయాలని కోరారు. రాష్ట్రం నుండి ప్రతిపాదనలు అందటమే ఆలస్యం నెలరోజుల్లోనే కేంద్రం ఓకే చెప్పేసింది.

అంటే జగన్ కోరిక మేరకు ప్రత్యేకంగా ఆర్ 5 జోన్ ప్రాంతంలో 47 వేల ఇళ్ళు నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఒక్కోఇంటికి రూ. 1.50 లక్షలు కేంద్రం భరిస్తుండగా , రాష్ట్రం వంతుగా రూ. 30 వేలుంటుంది. అంటే ప్రతి ఇంటిని సుమారు రూ. 1.80 లక్షలతో నిర్మించబోతున్నారు. కేంద్రం షేర్ ప్రకారమే రూ. 705 కోట్లను మంజూరు అవుతోంది. రాజధాని ప్రాంతంలో కావాలనే జగన్ పేదలకు పట్టాలిస్తున్నారని, రాజధాని ప్రాంతాన్ని మురికివాడగా మార్చేయబోతున్నట్లు అమరావతి జేఏపీ నేత‌లు గోల చేస్తున్నారు. అమరావతి జేఏసీ ముసుగులో ఎంతమంది కోర్టులో కేసులు వేసినా ఉపయోగం లేకపోయింది.

ఇప్పుడున్న ఓట్లకు జగన్ ప్రత్యామ్నాయ ఓటు బ్యాంకును రెడీ చేసుకోవటమే జగన్ అసలు ఉద్దేశంగా ప్రతిపక్షాలు గోల చేస్తున్నాయి. ఇందులో బీజేపీ కూడా ఉంది. అయినా సరే ప్రతిపక్షాల అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా జగన్ విజ్ఞప్తి ప్రకారం ప్రత్యేకంగా 47 వేల ఇళ్ళ నిర్మాణానికి పచ్చజెండా ఊపటం ప్రతిపక్షాలకు షాక్ కొట్టినట్లయ్యింది. ఒకవైపు జగన్ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని, అరాచకం రాజ్యమేలుతోందని కేంద్ర మంత్రులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ బకాయిలను క్లియర్ చేస్తుంది. తాజాగా 47 వేల ఇళ్ళ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం చాలా పెద్ద విషయమనే చెప్పాలి.

First Published:  27 Jun 2023 5:28 AM GMT
Next Story