Telugu Global
Andhra Pradesh

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణపై కేంద్రం వెనకడుగు..?

ఈ రోజు విశాఖకు వచ్చిన కేంద్రమంత్రి ఫగన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై ప్రస్తుతం ముందుకెళ్లడం లేదన్నారాయన. ముందు తాము 'రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్' ను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ పూర్తి సామ‌ర్థ్యం మేరకు పనిచేయడం మీద దృష్టిపెడతున్నామని ఆయన అన్నారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణపై కేంద్రం వెనకడుగు..?
X

విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కేంద్ర బీజేపీ సర్కార్ వెనకడుగు వేసిందా..? ఈరోజు కేంద్ర ఉక్కు సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు చూస్తే నిజమనే అనిపిస్తోంది.

ఈ రోజు విశాఖకు వచ్చిన కేంద్రమంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తీ స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో, ప్లాంట్‏కు చెందిన కార్మిక సంఘాల ప్రతినిధులతో వివిధ అంశాలపై చర్చిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై ప్రస్తుతం ముందుకెళ్లడం లేదన్నారాయన. ముందు తాము 'రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్' ను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ పూర్తి సామ‌ర్థ్యం మేరకు పనిచేయడం మీద దృష్టిపెడతున్నామని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ వేలం బిడ్ లో పాల్గొనడం ఒక రాజకీయ ఎత్తుగడ అని ఆయన ఆరోపించారు.

స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తామని చాలా కాలం క్రితమే కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆదేశంతో సింగరేణి అధికారులు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను పరీశీలించేందుకు వైజాగ్ వెళ్ళారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రకటన ఆసక్తిని కలిగిస్తోంది.

అయితే ఫగ్గన్ సింగ్ మాట్లాడుతూ, ప్రైవేటీకరణకు ముందు ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ను బలోపేతంపై దృష్టి పెడతామని అన్న మాట మాత్రం ప్రైవేటీకరణ పై కేంద్రం పూర్తిగా వెనక్కి తగ్గలేదా అనే అనుమానం కలుగుతోంది. కార్మిక సంఘాలు కూడా కేంద్ర మంత్రి ప్రకటనను నమ్మడం లేదు. కేంద్ర మంత్రివర్గం తీర్మానం చేసి, స్టీల్ ప్లాంట్ కు నిధులు, గనులు కేటాయిస్తే అప్పుడు కేంద్రాన్ని నమ్ముతామని కార్మిక నాయకులు చెప్తున్నారు.

First Published:  13 April 2023 7:50 AM GMT
Next Story