Telugu Global
Andhra Pradesh

ఏపీలో కార్టూన్ వార్.. పవన్ కి అదిరిపోయే కౌంటర్

ఆమధ్య తెలంగాణలో ఫ్లెక్సీ వార్ నడిచింది, ఇప్పుడు ఏపీలో కార్టూన్ వార్ నడుస్తోంది. హాట్ హాట్ రాజకీయాల్లో నేతల ఘాటు వ్యాఖ్యలకు బదులుగా కాస్త కామెడీ కలగలిపిన కార్టూన్లతో రాజకీయ పార్టీలు విమర్శలు ఎక్కు పెట్టుకుంటున్నాయి.

ఏపీలో కార్టూన్ వార్.. పవన్ కి అదిరిపోయే కౌంటర్
X

సూట్ కేసులనిండా డబ్బులు పెట్టుకుని సీఎం జగన్ నడచి వెళ్లిపోతున్నట్టుగా పాపం పసివాడు అనే టైటిల్ తో ఇటీవల ఓ కార్టూన్ వేయించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తన ట్విట్టర్లో ఆ కార్టూన్ ని పోస్ట్ చేసి విమర్శలు ఎక్కుపెట్టారు, అక్కడితో ఆగకుండా ఆ వ్యవహారాన్ని ఓ ఎపిసోడ్ లాగా కొనసాగిస్తున్నారు. దీనికి వైసీపీనుంచి కూడా కౌంటర్లు పడుతున్నాయి. వైసీపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి కౌంటర్ గా మరో కార్టూన్ ని బయటకొదిలారు. చంద్రబాబు చంకనెక్కిన పవన్ పుల్ల ఐస్ తింటున్నట్టుగా కార్టూన్ వేశారు, కౌంటర్ ఇచ్చారు.


"ప్యాకేజీ స్టార్ అంటే.. కోపంతో ఊగిపోయే ఈ పాపం పసోడు.. చివరికి..,

నేను ప్యాకేజీ స్టార్ నే.. అని రుజువు చేస్తూ.. చంద్రబాబు చంకనెక్కాడు!!"

అంటూ ఆ కార్టూన్ కి కామెంట్ జత చేశారు. ఇటీవల సీఎం జగన్, బాపట్ల సభలో ప్యాకేజ్ స్టార్ అంటూ పదే పదే పవన్ ని రెచ్చగొట్టేలా మాట్లాడారు. దానికి కౌంటర్ గానే పవన్ కార్టూన్ల రాజకీయం మొదలు పెట్టారు, పవన్ కౌంటర్ గా వైసీపీ కూడా అదే కార్టూన్లతో బదులిస్తోంది. ప్యాకేజీ స్టార్ అంటే కోపంతో ఊగిపోతూ చంద్రబాబు చంకనెక్కాడంటూ సెటైర్లు పేలుస్తోంది వైసీపీ.

ఆమధ్య తెలంగాణలో కూడా ఫ్లెక్సీ వార్ నడిచింది, ఇప్పుడు ఏపీలో కార్టూన్ వార్ నడుస్తోంది. హాట్ హాట్ రాజకీయాల్లో నేతల ఘాటు వ్యాఖ్యలకు బదులుగా కాస్త కామెడీ కలగలిపిన కార్టూన్లతో రాజకీయ పార్టీలు విమర్శలు ఎక్కు పెట్టుకుంటున్నాయి. అయితే వైసీపీ వర్సెస్ టీడీపీ కాకుండా.. వైసీపీ-జనసేన మధ్య ఈ కార్టూన్ వార్ మొదలు కావడం విశేషం. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలసి పోటీ చేయడం దాదాపు ఖరారు కాగా.. ఏపీలో రాజకీయం మరింత వేడెక్కింది.

First Published:  19 May 2023 1:33 AM GMT
Next Story