Telugu Global
Andhra Pradesh

బుచ్చయ్య వర్సెస్‌ కందుల.. రాజమండ్రి రూరల్‌లో రచ్చ

రాజమండ్రి రూరల్‌ టికెట్‌ ఆశించిన కందుల దుర్గేష్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కందుల దుర్గేష్‌కు రాజమండ్రి రూరల్‌కు బదులుగా నిడదవోలు టికెట్ కేటాయిస్తారని తెలుస్తోంది.

బుచ్చయ్య వర్సెస్‌ కందుల.. రాజమండ్రి రూరల్‌లో రచ్చ
X

రాజమండ్రి రూరల్‌ టికెట్‌పై సస్పెన్స్‌ కొనసాగుతోంది. రాజమండ్రి రూరల్ స్థానాన్ని జనసేనకు ఇస్తారని మొన్నటివరకు ప్రచారం జరిగింది. అయితే శనివారం ఉమ్మడి జాబితాను ప్రకటించిన టీడీపీ-జనసేన కూటమి ఈ సీటుపై క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు బుచ్చయ్య చౌదరికే టికెట్‌ దక్కుతుందని తాజాగా ప్రచారం జోరందుకుంది. బుచ్చయ్య చౌదరి సైతం చంద్రబాబు తనకే కేటాయించారని.. జనసేనకు నచ్చచెప్పడానికే పెండింగ్‌లో పెట్టారంటూ మీడియాకు చెప్పారు.

దీంతో రాజమండ్రి రూరల్‌ టికెట్‌ ఆశించిన కందుల దుర్గేష్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కందుల దుర్గేష్‌కు రాజమండ్రి రూరల్‌కు బదులుగా నిడదవోలు టికెట్ కేటాయిస్తారని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న జనసైనికులు పెద్ద ఎత్తున కందుల నివాసానికి చేరుకున్నారు.

రాజమండ్రి రూరల్‌ టికెట్‌ కందులకే ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. కందుల ఇంటి వద్ద ఉన్న జనసేన ఫ్లెక్సీలు, స్టిక్కర్లు తొలగించారు. జై కందుల అంటూ ఆందోళన చేస్తున్నారు.

First Published:  25 Feb 2024 10:46 AM GMT
Next Story