Telugu Global
Andhra Pradesh

ఆ సైన్స్‌వాడికి బుర్ర లేదు - బ్రదర్ అనిల్‌ వ్యాఖ్యలు

కోతికి కోతే పుడుతుంది.. మనిషికి మనిషే పుడుతాడని.. ఆ విషయం తెలియక ఆ సైన్స్‌వాడు కోతి నుంచి మనిషి వచ్చాడని చెబుతున్నాడని వాడికి బుర్ర లేదని అనిల్ విమర్శించారు.

ఆ సైన్స్‌వాడికి బుర్ర లేదు - బ్రదర్ అనిల్‌ వ్యాఖ్యలు
X

వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్‌ మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పేర్లు ప్రస్తావించకుండానే ప్రభుత్వాలపై ఆయన విమర్శలు చేశారు. విశాఖలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ప్రసంగించిన ఆయన... తమ స్వార్థం కోసం ప్రభుత్వాలిచ్చే పథకాలపై ఆధారపడవద్దని సూచించారు. ఏ ప్రభుత్వమైనా సరే దేవుడి పాలనకు దగ్గరగా ఉందా అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఏ ప్రభుత్వం కూడా దేవుడి రాజ్యానికి దగ్గరగా లేదని విమర్శించారు. దేవుడి రాజ్యంలో ప్రేమ మాత్రమే ఉంటుందన్నారు. పేరు చెప్పకుండానే ఈ రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రంలో పుట్టి ఉంటే బాగుండు అన్న భావన ప్రజల్లో ఏర్పడిందన్నారు.

స్టేజ్ మీద తన ప్రసంగంలో మధ్య మధ్యలో పలు అంశాలను అనిల్ ప్రస్తావించారు. సైన్స్‌ను ఎద్దేవా చేశారు. కోతికి కోతే పుడుతుంది.. మనిషికి మనిషే పుడుతాడని.. ఆ విషయం తెలియక ఆ సైన్స్‌వాడు కోతి నుంచి మనిషి వచ్చాడని చెబుతున్నాడని వాడికి బుర్ర లేదని అనిల్ విమర్శించారు. భారతీయులు భక్తిపరులని... ఈ దేశంలో అనేక మంది దొంగ బాబాలున్నారని విమర్శించారు. వారంతా దొంగ బాబాలు అని తెలిసి కూడా వారిని ఏమీ చేయరని వ్యాఖ్యానించారు. అలాంటి వారు ప్రజలను మోసం చేస్తున్నారని బ్రదర్ అనిల్ విమర్శించారు.

First Published:  16 Dec 2022 5:28 AM GMT
Next Story