Telugu Global
Andhra Pradesh

బ్రాహ్మణితో కూడా అబద్ధాలు చెప్పిస్తున్నారా?

తాజాగా బ్రాహ్మణి చేసిన ఒక ట్వీట్ ఎల్లోమీడియాలో వచ్చింది. అందులో పారిశ్రామిక ప్రగతి గురించి జగన్ ప్రభుత్వంపై బ్రాహ్మణి అనేక ఆరోపణలు చేశారు.

బ్రాహ్మణితో కూడా అబద్ధాలు చెప్పిస్తున్నారా?
X

అబద్ధాలు చెప్పటంలో చంద్రబాబునాయుడు, లోకేష్ ఆరితేరిపోయారు. కాబట్టి వాళ్ళ నోటి నుండి ఒక్కటంటే ఒక్క నిజం కూడా రాదు. వాళ్ళు నిజాలు చెబుతారని జనాలు కూడా ఆశించటంలేదు. పాపం బ్రాహ్మణి కూడా వాళ్ళ ట్రైనింగ్‌లో అలాగే తయారవుతోంది. చంద్రబాబు అరెస్టు, రిమాండు దెబ్బకు లోకేష్ గడచిన 15 రోజులుగా ఏపీలో క‌నిపించ‌డం లేదు. దాంతో ఇంతకాలం వ్యాపారాలకు మాత్రమే పరిమితమైన భువనేశ్వరి, బ్రాహ్మణి రోడ్లపైకి, మీడియా ముందుకు రాక తప్పలేదు.

వీళ్ళిద్దరిలో కూడా బ్రాహ్మణి కాస్త దూకుడుగా ఉండటంతో తననే అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా తిప్పాలని సీనియర్ తమ్ముళ్ళంతా డిసైడ్ అయిపోయారు. ఇందులో భాగంగా ఇప్పుడిప్పుడే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఆరోపణలు మొదలుపెట్టింది. తాజాగా బ్రాహ్మణి చేసిన ఒక ట్వీట్ ఎల్లోమీడియాలో వచ్చింది. అందులో పారిశ్రామిక ప్రగతి గురించి జగన్ ప్రభుత్వంపై బ్రాహ్మణి అనేక ఆరోపణలు చేశారు. అందులో ఎంతవరకు నిజముందో ఒకసారి బ్రాహ్మణి చెక్ చేసుకుంటే బాగుంటుంది.

జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి చంద్రబాబు, లోకేష్, తమ్ముళ్ళతో పాటు ఎల్లోమీడియా చేస్తున్న నిరాధార ఆరోపణలనే బ్రాహ్మణి కూడా చేశారు. ఇంతకీ అదేమిటంటే జగన్ ప్రభుత్వ వైఖరితో పరిశ్రమలన్నీ తరలిపోతున్నాయట. ఏపీ అంటేనే పారిశ్రామికవేత్తలు భయపడిపోతున్నారట. అమరరాజా, లులూ, జాకీ పరిశ్రమలు వెళ్ళిపోవటంతో రాష్ట్రం లక్షల కోట్ల పెట్టుబడి, వేల ఉద్యోగాలను కోల్పోయిందట. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. నాలుగున్నరేళ్ళల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల జరిగిన పారిశ్రామిక విధ్వంసంపై ప్రముఖ వెబ్‌సైట్ ‘ది ప్రింట్’ కథనాన్ని బ్రాహ్మణి జత చేశారట.

ఇక్కడ బ్రాహ్మణి తెలుసుకోవాల్సింది ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల ఏ పరిశ్రమ కూడా వెళ్ళిపోలేదు. అమరరాజా పరిశ్రమ ఎక్కడికీ వెళ్ళలేదు. తెలంగాణలో పరిశ్రమను విస్తరించిందంతే. ఇక లులూ పరిశ్రమ చంద్రబాబు హయాంలోనే మొదలుకాలేదు. ఒప్పందం చేసుకున్న మూడేళ్ళకు కూడా లులూ గ్రూపు వైజాగ్‌లో పరిశ్రమను ఎందుకు పెట్టలేదో బ్రాహ్మణే చెప్పాలి. భూములు తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని అనుకున్నది యాజమాన్యం. 2019లో చంద్రబాబే అధికారంలోకి వచ్చుంటే అదే జరిగేది. జగన్ అధికారంలోకి రాగానే యాజమాన్యం ఏమనుకున్నదో ఏమో ఏపీ నుండి వెళ్ళిపోయింది.

ఇక జాకీ కంపెనీ కూడా చంద్రబాబు అధికారంలో ఉన్నపుడే హైదరాబాద్‌కు మారిపోతున్నట్లు ప్రకటించింది. అనంతపురం జిల్లాలో పరిస్థితులు అనుకూలంగా లేనికారణంగానే ఒప్పందాలు రద్దు చేసుకుంటున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. పారిశ్రామిక విధ్వంసం జరుగుతున్నదే వాస్తవమైతే వైజాగ్‌లో పెట్టుబడుల సదస్సుకు వందల సంఖ్యలో పారిశ్రామికవేత్తలు ఎలా వచ్చారు? ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీతో కలిసి సుమారు 200 మంది పారిశ్రామికవేత్తలు వచ్చింది బ్రాహ్మణికి తెలియ‌దా? వివిధ జిల్లాల్లో పారిశ్రామిక యూనిట్లు మొదలవుతున్న విషయం బ్రాహ్మణి చూడటంలేదా? బ్రాహ్మణికి అన్నీ తెలిసే ఉంటాయి. వెబ్‌సైట్లో కూడా వీళ్ళే తప్పుడు రాతలు రాయించుంటారు. బ్రాహ్మణికి అన్నీ తెలిసే చంద్రబాబు, లోకేష్ కారణంగా అబద్ధాలను ట్వీట్ చేసి ఉంటుంది.

First Published:  30 Sep 2023 5:38 AM GMT
Next Story