Telugu Global
Andhra Pradesh

భుజాలు తడుముకుంటున్న బొండా.. అరెస్ట్ ఖాయమేనా..?

రాయిదాడి కేసులో నిందితుడు సతీష్ పై బొండా ఉమా సింపతీ చూపించడం కొసమెరుపు. సీఎంపై గులకరాయి దాడి జరిగితే మైనర్‌ను తప్పుడు కేసులో ఇరికించి లోపల పెట్టారని అంటున్నారాయన.

భుజాలు తడుముకుంటున్న బొండా.. అరెస్ట్ ఖాయమేనా..?
X

సీఎం జగన్ పై జరిగిన దాడి వెనక ఎవరున్నారనేది పోలీసులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే టీడీపీ నేతలు మాత్రం భుజాలు తడుముకుంటున్నారు. ముఖ్యంగా బొండా ఉమా.. ప్రెస్ మీట్ పెట్టిమరీ తన ప్రమేయం లేదని చెబుతున్నారు. ఇటీవల చంద్రబాబు కూడా తన పర్యటనలో బొండా ఉమాపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇవన్నీ చూస్తుంటే.. ఇందులో బొండా ప్రమేయం ఉందేమోనన్న అనుమానం కలగక మానదు. త్వరలో ఆయన్ను అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.

సీఎం జగన్ పై దాడి కేసులో ఏ-1 సతీష్ అనేది అధికారికం. ఏ-2 దుర్గారావు పేరు ఇంకా అధికారికంగా బయటకు రాలేదు. అయితే దుర్గారావు వెనక, టీడీపీ నేత బొండా ఉమా ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అంటే బొండా డైరక్షన్ లోనే ఇదంతా జరిగిందని తెలుస్తోంది. దీంతో ఆయన హడావిడి పడిపోతున్నారు. పోలీసులను చూస్తే చాలు వణికిపోతున్నారు. తాజాగా ప్రెస్ మీట్ పెట్టిన బొండా తనను పోలీసులు నిత్యం వేధిస్తున్నారని చెప్పారు. 100 మంది పోలీసులు శుక్రవారం తన ఆఫీసుని చుట్టుముట్టారన్నారు. ఇద్దరు ఏసీపీలు, నలుగురు సీఐలు, ఆరుగురు ఎస్సైలు, కానిస్టేబుళ్లు వచ్చారన్నారు. యుద్ధానికి వచ్చినట్లు విజయవాడ సీపీ తన మీదకు వారిని పంపారని చెప్పారు బొండా ఉమా.

నిందితుడిపై సింపతీ..

రాయిదాడి కేసులో నిందితుడు సతీష్ పై బొండా ఉమా సింపతీ చూపించడం కొసమెరుపు. సీఎంపై గులకరాయి దాడి జరిగితే మైనర్‌ను తప్పుడు కేసులో ఇరికించి లోపల పెట్టారని అంటున్నారాయన. రిమాండ్‌లో ఉన్న వేముల సతీష్‌ తల్లిదండ్రులను అక్రమంగా నిర్బంధించారని కూడా ఆరోపించారు. రెండు రోజుల నుంచి వారిని పోలీసులు వేధిస్తున్నారని చెప్పారు. వడ్డెర గూడెంలో ఉండటమే వేముల దుర్గారావు పాపమా? అని అన్నారు. ఏ సంబంధం లేని అతడిని తీసుకెళ్లి ఎక్కడ దాచారో తెలియదని, తప్పుడు కేసు అంగీకరించాలని అతడితోపాటు మహిళలను కూడా చిత్రహింసలు పెడుతున్నారని ఆరోపించారు. అసలు దుర్గారావును జడ్జి ఎదుట ఎందుకు హాజరుపరచలేదని ప్రశ్నించారు. తమ పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారని అన్నారు బొండా ఉమా.

First Published:  20 April 2024 5:08 AM GMT
Next Story