Telugu Global
Andhra Pradesh

ఏపీ బీజేపీలో ముస‌లం.. సోము వీర్రాజు వైఖ‌రికి నిర‌స‌న‌గా బీజేపీ నేత‌ల రాజీనామా

జిల్లా అధ్యక్షుల మార్పుపై కనీసం తమను సంప్రదించలేదని రాజీనామా చేసిన నేత‌లు ఆవేదన వ్యక్తం చేశారు. కోర్ కమిటీలో చర్చించకుండా ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకోవ‌డం బీజేపీ సంప్ర‌దాయం కాద‌ని వారంటున్నారు.

ఏపీ బీజేపీలో ముస‌లం.. సోము వీర్రాజు వైఖ‌రికి నిర‌స‌న‌గా బీజేపీ నేత‌ల రాజీనామా
X

ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజుపై క‌మ‌ల‌నాథులు క‌న్నెర్ర జేస్తున్నారు. ఇన్నాళ్లూ ఆయ‌న నియంతృత్వ పోక‌డల‌ను అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల‌లో లేవ‌నెత్తిన నేత‌లంతా ఒక్క‌సారిగా బ‌ర‌స్ట్ అవుతున్నారు. కోర్ క‌మిటీలో చ‌ర్చించ‌కుండా ఆరు జిల్లాల బీజేపీ అధ్యక్షులను మార్చేయ‌డంతో అస‌మ్మ‌తివ‌ర్గం భ‌గ్గుమంటోంది. తొల‌గించిన వారు మాజీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ విధేయులు. కొత్త‌గా ఆ ప‌ద‌వులు పొందిన వారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకి వీర విధేయులు. ఈ అధ్య‌క్షుల‌ను సోము వీర్రాజు ప్ర‌క‌టించ‌ని వెంట‌నే కృష్ణా జిల్లా ప్రధాన‌కార్యదర్శి పదవికి నాదెండ్ల‌ మోహన్ , సీనియర్ నేతలు తుమ్మల ఆంజనేయులు, చిగురుపాటి కుమారస్వామిలు త‌మ పార్టీ పదవులకి రాజీనామా చేశారు. పార్టీ కార్యదర్శి పదవికి సేవన ఉమామహేశ్వరి కూడా రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

జిల్లా అధ్యక్షుల మార్పుపై కనీసం తమను సంప్రదించలేదని రాజీనామా చేసిన నేత‌లు ఆవేదన వ్యక్తం చేశారు. కోర్ కమిటీలో చర్చించకుండా ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకోవ‌డం బీజేపీ సంప్ర‌దాయం కాద‌ని వారంటున్నారు. మ‌రోవైపు సోము వీర్రాజు తీరుపై కన్నా లక్ష్మీనారాయణ ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. కోర్ కమిటీలో చర్చ లేకుండానే, ఏక‌ప‌క్షంగా తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు జిల్లా అధ్యక్షులను మార్చార‌ని ఆరోపించారు.

Next Story