Telugu Global
Andhra Pradesh

చిరంజీవికి 'బీజేపీ' గాలం.. అవార్డు వెనక ఆంతర్యం అదేనా..?

బీజేపీ పెద్దలు ఏపీలో చిరంజీవికి కూడా గాలం వేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.తాజాగా చిరంజీవికి 'ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ -2022` అవార్డు దక్కింది.

చిరంజీవికి బీజేపీ గాలం.. అవార్డు వెనక ఆంతర్యం అదేనా..?
X

సౌత్‌లో బలపడాలని బీజేపీ ఎప్పటి నుంచో అనుకుంటోంది. అందుకోసం అనేక వ్యూహాలు రచిస్తోంది. కానీ కర్ణాటకలో, ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో తప్ప ఆ పార్టీ వ్యూహాలు పెద్దగా వర్కవుట్ అయినట్టు కనిపించడం లేదు. తమిళనాడులో ప్రాంతీయాభిమానం ఎక్కువ గనక .. అక్కడ జాతీయపార్టీలకు పెద్దగా స్కోప్ ఉండదు. ఇక కేరళలోనూ విద్యావంతులు అధికం.. అక్కడ కూడా బీజేపీ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించడం లేదు. దీంతో ఇటీవల ఆ పార్టీ తెలంగాణ రాష్ట్రం మీద కన్నేసింది. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీలో అనేక లోపాలు ఉండటం.. ఆ పార్టీకి కలిసి వచ్చింది. దీంతో ఆ పార్టీ వేసిన పాచికలు కొద్దికొద్దిగా పారుతున్నట్టు కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే ఏపీలో మాత్రం బీజేపీ పట్టు సాధించడం కష్టతరమైంది. ఆ పార్టీకి ఏపీలో ఏ కోశాన బలపడేందుకు అవకాశాలు కనిపించడం లేదు. కాగా ప్రస్తుతం ఏపీలో బీజేపీ, జనసేన పొత్తులో ఉన్నాయి. అయితే వచ్చే ఎన్నికల దాకా ఈ పొత్తు కొనసాగుతుందా? లేదా? అన్నది వేచి చూడాలి. ఇదిలా ఉంటే ప్రస్తుతం బీజేపీ పెద్దలు ఏపీపై కూడా గట్టిగానే ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఇటీవల బీజేపీ మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కల్యాణ్.. టీడీపీతో జత కట్టేందుకు సిద్ధమవుతున్నట్టు సంకేతాలు అందాయి. దీంతో అతడిని కాపాడుకొనేందుకు బీజేపీ ప్రయత్నించినట్టు తెలుస్తోంది.అందులో భాగంగానే విశాఖ పర్యటనలో పవన్ కల్యాణ్ తో ప్రధాని మోడీ భేటీ అయినట్టు వార్తలు వచ్చాయి.

కాగా ప్రధాని మోడీ పర్యటన అనంతరం పవన్ స్వరంలో కొద్దిగా మార్పు వచ్చింది. టీడీపీతో కొంత అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే 'నాకు ఓ చాన్స్ ఇవ్వండి' అంటూ పవన్ పిలుపునిచ్చారు.

ఇదిలా ఉంటే బీజేపీ పెద్దలు ఏపీలో చిరంజీవికి కూడా గాలం వేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.తాజాగా చిరంజీవికి 'ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ -2022` అవార్డు దక్కింది. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటి నుంచీ ఆ పార్టీ అవార్డుల విషయంలోనూ రాజకీయాలు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అందుకనుగుణంగనే బీజేపీ మద్దతుదారులకు, సంప్రదాయవాదులకు మాత్రమే అవార్డులు దక్కుతున్నాయి. అయితే తాజాగా చిరంజీవికి బీజేపీ అవార్డు ఇవ్వడం వెనక రాజకీయ కారణాలు ఉన్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో.. ముఖ్యంగా ఏపీలో చిరంజీవిని తమకు అనుకూలంగా మలుచుకొనేందుకు బీజేపీ ఎత్తులు వేస్తున్నట్టు విశ్లేషణలు సాగుతున్నాయి. అయితే చిరంజీవికి అవార్డు దక్కడం వెనక ఏదైనా రాజకీయ కారణం ఉందా..? లేదా..? అనే విషయం భవిష్యత్ లో తెలియనున్నది.

First Published:  21 Nov 2022 10:57 AM GMT
Next Story