Telugu Global
Andhra Pradesh

బిగ్ రిలీఫ్.. అది మంకీపాక్స్ కాదు.. నిర్ధారించిన వైద్యాధికారులు

బాలిక నమూనాలను పూణేకు పంపించారు. శాంపిల్స్ పరీక్షించిన అక్కడి నిపుణులు.. చిన్నారికి మంకీపాక్స్ రాలేదని నిర్ధారించారు.

బిగ్ రిలీఫ్.. అది మంకీపాక్స్ కాదు.. నిర్ధారించిన వైద్యాధికారులు
X

విజయవాడకు చెందిన ఓ చిన్నారికి మంకీ పాక్స్ వచ్చినట్టు ఈ మధ్యాహ్నం వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఇటీవల విజయవాడకు చెందిన ఓ ఫ్యామిలీ దుబాయ్ నుంచి వచ్చింది. అయితే ఈ కుటుంబంలోని ఓ చిన్నారికి మంకీపాక్స్ లక్షణాలు కనిపించడంతో కుటుంబసభ్యులు వైద్యులను సంప్రదించారు. మంకీపాక్స్ గా అనుమానించిన వైద్యులు.. కుటుంబాన్ని ఐసోలేషన్ లో ఉంచారు. చిన్నారిని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందించారు.

అనంతరం బాలిక నమూనాలను పూణేకు పంపించారు. శాంపిల్స్ పరీక్షించిన అక్కడి నిపుణులు.. చిన్నారికి మంకీపాక్స్ రాలేదని నిర్ధారించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా మంకీపాక్స్ కలకలం రేపుతోంది. కేరళలో ఓ వ్యక్తికి మంకీపాక్స్‌ అనుమానిత లక్షణాలు బయటపడ్డాయి.

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ నుంచి నాలుగు రోజుల క్రితం వచ్చిన ఓ వ్యక్తి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. అతడి నమూనాలను పూణేలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించగా మంకీ పాక్స్ వచ్చినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వైద్యాధికారులు ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉన్నారు. ఎక్కడి ఎవరికి లక్షణాలు కనిపించినా వారిని ఐసోలేషన్ కు పంపిస్తున్నారు.

First Published:  17 July 2022 1:14 PM GMT
Next Story