Telugu Global
Andhra Pradesh

చంద్రబాబును భువనేశ్వరి ఇరికించేశారా?

జైలు నిబంధనల ప్రకారం చంద్రబాబు లేఖ రాయలంటే ముందు ఆ విషయాన్ని అధికారులకు చెప్పాలి. ఎందుకంటే పేపర్, పెన్ను ఇవ్వాల్సింది వాళ్ళే కాబట్టి. అధికారులు ఓకే అనుకుంటేనే చంద్రబాబుకు పెన్ను, పేపర్ ఇస్తారు.

చంద్రబాబును భువనేశ్వరి ఇరికించేశారా?
X

భువనేశ్వరి తాజా వ్యాఖ్యలు విన్నతర్వాత అందరికీ ఇదే అనుమానం మొదలైంది. ఈ మధ్యనే చంద్రబాబు పేరుతో రాష్ట్ర ప్రజలకు ఒక లేఖ జారీ అయిన విషయం తెలిసిందే. ఆ లేఖను ప్రజలను ఉద్దేశించి డైరెక్టుగా చంద్రబాబే రాసినట్లుంది. అయితే ఆ లేఖను చంద్రబాబు రాసే అవకాశం ఎంతమాత్రం లేదు. ఇదే విషయాన్ని మంత్రులు, వైసీపీ నేతలు స్పష్టంగా చెబుతున్నారు. దీనిపై మీడియాలో కూడా రాద్దాంతం జరిగింది.

ఇదే విషయమై జైలు అధికారులు విచారణ కూడా చేస్తున్నారు. విచారణ ఒకవైపు జరుగుతుండగానే తాజాగా భువనేశ్వరి మాట్లాడుతూ.. లేఖను ముమ్మాటికి చంద్రబాబే రాశారని బల్లగుద్ది మరీ చెప్పారు. ఈ వివాదానికి దూరంగా ఉండాల్సిన భువనేశ్వరి అనవసరంగా మాట్లాడారు. ఇక్కడ సమస్య ఏమిటంటే జైలులో ఉన్నపుడు ఖైదీలైనా, రిమాండు ఖైదీలైనా ఫాలో అవ్వాల్సిన రూల్సు కొన్ని ఉంటాయి. అవి జేబులు కొట్టే చిల్లర దొంగలకైనా.. చంద్రబాబుకైనా ఒకటే.

జైలు నిబంధనల ప్రకారం చంద్రబాబు లేఖ రాయలంటే ముందు ఆ విషయాన్ని అధికారులకు చెప్పాలి. ఎందుకంటే పేపర్, పెన్ను ఇవ్వాల్సింది వాళ్ళే కాబట్టి. అధికారులు ఓకే అనుకుంటేనే చంద్రబాబుకు పెన్ను, పేపర్ ఇస్తారు. తర్వాత తాను రాసిన లేఖను చంద్రబాబు అధికారులకే అందజేయాల్సి ఉంటుంది. ఆ లేఖను అధికారులు చదివిన తర్వాత అందులో ఎలాంటి అభ్యంతరకరమైన అంశాలు లేవని అనుకుంటేనే ఆ లేఖను బయటకు పంపుతారు. అయితే చంద్రబాబు పేరుతో విడుదలైన లేఖ మొత్తం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే ఉంది.

అధికారులు గనుక ఆ లేఖను చూసి ఉంటే ఎట్టి పరిస్ధితుల్లోను బయటకు వెళ్ళనిచ్చే వారు కాదు. అలాంటపుడు జైలులో ఉన్న చంద్రబాబు జనాలను ఉద్దేశించి లేఖ ఎలా రాశారు? ఆ లేఖ జైలు దాటి బయటకు ఎలా వెళ్ళింది? ములాఖత్ పేరుతో చంద్రబాబును కలిసేందుకు వెళ్లేవారిని చెక్ చేసే లోప‌లికి పంపుతారు. అలాంట‌ప్పుడు జైలు అధికారులకు తెలియ‌కుండా పేపర్, పెన్ను చంద్రబాబుకు చేరే అవకాశమే లేదు. ఈ విషయంపైనే పోలీసు అధికారులు విచారణ చేస్తున్నారు. ఇదే సమయంలో భువనేశ్వరి మాట్లాడుతూ.. ఆ లేఖను స్వయంగా చంద్రబాబే రాశారని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. భువనేశ్వరి వ్యాఖ్యలు చూసిన తర్వాత చంద్రబాబును ఇరికించేశారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

First Published:  27 Oct 2023 6:35 AM GMT
Next Story