Telugu Global
Andhra Pradesh

రేపటి నుంచి బాలకృష్ణ 'స్వర్ణాంధ్ర సాకరయాత్ర'

రేపటి నుంచి రాయలసీమలో 'స్వర్ణాంధ్ర సాకరయాత్ర' పేరిట బాలకృష్ణ ప్రచారం నిర్వహించనున్నారు. ఇందుకోసం టీడీపీ అన్ని సౌకర్యాలతో ఒక ప్రత్యేక బస్సును కూడా సిద్ధం చేసింది.

రేపటి నుంచి బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాకరయాత్ర
X

ఎన్నికల ప్రచారానికి ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సిద్ధం అవుతున్నారు. రేపటి నుంచి ఆయన రాయలసీమలో 'స్వర్ణాంధ్ర సాకరయాత్ర' ప్రారంభించనున్నారు. ఎన్నికలకు షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ పార్టీ మరో సీనియర్ నాయకుడు అయిన బాలకృష్ణ మాత్రం ఇంకా ప్రచారానికి రాలేదు. సినిమా షూటింగ్ లలో బిజీ బిజీగా గడుపుతూ వచ్చారు.

ఇప్పుడు ఆయన కూడా ఎన్నికల ప్రచారానికి సిద్ధం అయ్యారు. రేపటి నుంచి రాయలసీమలో 'స్వర్ణాంధ్ర సాకరయాత్ర' పేరిట బాలకృష్ణ ప్రచారం నిర్వహించనున్నారు. ఇందుకోసం టీడీపీ అన్ని సౌకర్యాలతో ఒక ప్రత్యేక బస్సును కూడా సిద్ధం చేసింది. ఆ బస్సు కు సంబంధించిన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కొద్ది రోజులపాటు బాలకృష్ణ రాయలసీమలో ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 19న బాలకృష్ణ హిందూపురం తెలుగుదేశం అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు.

రాయలసీమలో ప్రచారం ముగిసిన అనంతరం ఈనెల 25 నుంచి ఉత్తరాంధ్రలో బాలకృష్ణ ప్రచారం చేపట్టనున్నారు. బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమా చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం కోసం బాలకృష్ణ ఈ సినిమాకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారని సమాచారం. ఎన్నికలు ముగిసిన తర్వాత తిరిగి బాలకృష్ణ ఆ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు.

First Published:  12 April 2024 11:08 AM GMT
Next Story