Telugu Global
Andhra Pradesh

వైఎస్ఆర్ గ్రేట్ పర్సనాల్టీ, గ్రేట్ లీడర్ -బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షో లో వైఎస్ఆర్ గ్రేట్ పర్సనాల్టీ, గ్రేట్ లీడర్ అంటూ కొనియాడారు. టాక్ షో ఇంకా పూర్తిగా బయటకు రాలేదు కానీ, దీనికి సంబంధించిన ప్రోమో, అందులో బాలయ్య మాటలు వైరల్ గా మారాయి.

వైఎస్ఆర్ గ్రేట్ పర్సనాల్టీ, గ్రేట్ లీడర్ -బాలకృష్ణ
X

ఇటీవల ఏపీలో హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు వ్యవహారం సంచలనంగా మారింది. ఎన్టీఆర్ గొప్పా, వైఎస్సార్ గొప్పా అనే చర్చ మొదలైంది. ఇద్దరూ గొప్ప అనేవారు కూడా పేరు మార్పు వ్యవహారంలో సందిగ్ధంలో పడ్డారు. టీడీపీ, నందమూరి ఫ్యామిలీ.. హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడాన్ని తీవ్రంగా ఖండించింది. అయితే తాజాగా నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షో లో వైఎస్ఆర్ గ్రేట్ పర్సనాల్టీ, గ్రేట్ లీడర్ అంటూ కొనియాడారు. టాక్ షో ఇంకా పూర్తిగా బయటకు రాలేదు కానీ, దీనికి సంబంధించిన ప్రోమో, అందులో బాలయ్య మాటలు వైరల్ గా మారాయి.

అన్ స్టాపబుల్ అంటూ సీజన్-2 లో రాజకీయ నాయకుల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు బాలయ్య. చంద్రబాబుని టాక్ షో కి పిలిపించి వెన్నుపోటు ఎపిసోడ్ ని కవర్ చేయాలని చూశారు. తన ప్రాణ స్నేహితులంటూ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిని తన టాక్ షో కి ఆహ్వానించారు. ఈ ప్రోమో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డి, బాలయ్య కలసి చేసిన హంగామా ఆకట్టుకుంటోంది. మధ్యలో సీనియర్ హీరోయిన్ రాధిక కూడా వీరితో కలసి సందడి చేసింది.

వైఎస్సార్ ని మిస్ లీడ్ చేసింది ఎవరు..?

ఈ టాక్ షో ప్రోమోలో కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిన మాటలు కూడా సంచలనం అవుతున్నాయి. అప్పట్లో ఓ సీనియర్ మంత్రి, వైఎస్ఆర్ ని మిస్ లీడ్ చేసేవారు అని చెప్పారు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. తాను బతికున్నాను కాబట్టే సీఎం అయ్యానంటూ అప్పటి వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదాన్ని మరోసారి గుర్తు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నవంబర్-25న అన్ స్టాపబుల్ ఎపిసోడ్ లో బయటికొస్తాయి. ఇక కాలేజీ కబుర్లు, అమ్మాయిలకు సైట్ కొట్టడం.. వగైరా వగైరా ఉన్నా కూడా.. అప్పటి రాజకీయాలపై కిరణ్ కుమార్ రెడ్డి స్పందన ఇప్పుడు ఆసక్తికరంగా మారే అవకాశముంది. అందులోనూ వైఎస్ఆర్ పై బాలయ్య పొగడ్తలు కూడా ఈ టాక్ షో పై క్యూరియాసిటీ పెంచుతున్నాయి.

First Published:  18 Nov 2022 3:22 AM GMT
Next Story