Telugu Global
Andhra Pradesh

తండ్రికోసం కూతురు త్యాగం చేసినట్టేనా..?

గడచిన మూడున్నరేళ్ళుగా బాగా యాక్టివ్‌గా ఉన్న అదితి సడెన్‌గా ఎందుకని సైడైపోయారు..? ఎందుకంటే తండ్రి అశోక్‌ జగజపతిరాజు కోసమే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

తండ్రికోసం కూతురు త్యాగం చేసినట్టేనా..?
X

ఇప్పుడిదే విషయంపై పార్టీలోనూ, జిల్లాలోనూ బాగా చర్చజరుగుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చేఎన్నికల్లో కేంద్ర మాజీమంత్రి పూసపాటి అశోక్‌ గజపతిరాజు పోటీచేయటం దాదాపు ఖాయమైపోయింది. మొన్నటి వరకు అంటే మూడునెలల క్రితం వరకు చాలా యాక్టివ్‌గా తిరిగిన అదితి విజయలక్ష్మీ గజపతిరాజు ఇప్పుడు ఎవరితోనూ కాంటాక్టులో లేరు. పార్టీ సమావేశాల్లో కానీ, కార్యక్రమాల్లో కూడా ఎక్కడా కనబడటంలేదు. దాంతో ఎన్నికల నుంచి ఆమె సైడ్‌ అయిపోయినట్లే అర్థమవుతోంది.

గడచిన మూడున్నరేళ్ళుగా బాగా యాక్టివ్‌గా ఉన్న అదితి సడెన్‌గా ఎందుకని సైడైపోయారు..? ఎందుకంటే తండ్రి అశోక్‌ జగజపతిరాజు కోసమే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ టికెట్‌ ను తండ్రి కోసం అదితి త్యాగం చేసినట్లు నేతలు చెప్పుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో విజయనగరం ఎంపీగా అశోక్, ఎమ్మెల్యేగా అదితి పోటీచేసి ఓడిపోయారు. ఓడిపోయినా వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అదితి పార్టీ కార్యక్రమాల్లో రెగ్యులర్‌గా కనిపించేవారు.

అయితే హఠాత్తుగా పార్టీ కార్యక్రమాల నుంచిlమాయమైపోయారు. కారణం ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో ఫ్యామిలీ ప్యాకేజీలు కుదరవని చంద్రబాబునాయుడు స్పష్టంగా చెప్పేశారట. తండ్రి, కూతుళ్ళల్లో ఎవరు పోటీచేయాలో తేల్చుకోమని వాళ్ళకే ఛాయిస్‌ ఇచ్చారట. దాంతో వాళ్ళు మాట్లాడుకుని తానే పోటీలో ఉంటానని అశోక్‌ చెప్పారట. అందుకనే కూతురు అదితి ఇప్పుడు ఎక్కడా కనబడటంలేదు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే 72 ఏళ్ళ వయసున్న అశోక్‌కు ఎన్నికలనాటికి 74 వచ్చేస్తుంది. అంతవయసులో కూడా తానే పోటీచేస్తానంటే ఇక అదితి ఎప్పుడు పోటీచేయాలి. మొన్న పోటీచేసిందే అదితికి మొదటి ఎన్నిక. అశోక్‌ ఇప్పటికే ఓ పదిసార్లు పోటీచేసుంటారు. ఇంతవయసులో కూడా తండ్రే పోటీచేయటం అదితికి నచ్చలేదని ఇన్‌సైడ్‌ టాక్‌. అయితే ఏమీ చేయలేక అసలు పార్టీకే దూరంగా ఉండాలని డిసైడ్‌ అయిపోయారట. మొత్తానికి తండ్రికోసం అదితి టికెట్‌ ను త్యాగం చేసేసిందని పార్టీలో నేతలు చెప్పుకుంటున్నారు.

First Published:  2 Nov 2022 5:49 AM GMT
Next Story