Telugu Global
Andhra Pradesh

బుచ్చయ్య విషయం సస్పెన్సుగా మారిందా..?

ఆ హామీ ప్రకారం పవన్ పట్టుబట్టబోయే నియోజకవర్గాల్లో రాజమండ్రి రూరల్ కూడా ఒకటి. ఇక్కడ ప్రస్తుతం టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

బుచ్చయ్య విషయం సస్పెన్సుగా మారిందా..?
X

అటుతిరిగి ఇటుతిరిగి సీనియర్ నేత, ఎంఎల్ఏ గోరంట్ల బుచ్చయ్యచౌదరి టికెట్ కు ఎసరొచ్చేట్లుంది. ఈ విషయాన్ని పార్టీ నేతలు డైరెక్టుగా ఆయన్నే అడిగేస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు ఖాయమైనట్లే. పొత్తులో భాగంగా ఎన్నోకొన్ని సీట్లను చంద్రబాబు నాయుడు జనసేనకు కేటాయించక తప్పదు. జనసేన కోరుకునే సీట్లలో ఎక్కువగా ఉభయ గోదావరి, రాయలసీమలోనే ఉంటాయని ప్రచారం విపరీతంగా పెరిగిపోతోంది.

జనసేన సుమారు 35 సీట్లపైన గట్టిగా పట్టుబడుతోందనే ప్రచారం అందరికీ తెలిసిందే. జనసేన అడిగినన్ని సీట్లను చంద్రబాబు ఇస్తారా లేదా అన్నది సస్పెన్సుగా మారింది. మరి ఇచ్చేసీట్లేవి..? అన్నదే అసలైన పాయింట్. ఇందులో భాగంగానే రాజమండ్రి రూరల్ సీటు కోసం పవన్ గట్టిగా పట్టబోతున్నారు అనేది ప్రచారం. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న నేతలందరికీ తిరిగి టికెట్లు ఇప్పించే బాధ్యత తనదే అని పవన్ హామీ ఇచ్చారట.

ఆ హామీ ప్రకారం పవన్ పట్టుబట్టబోయే నియోజకవర్గాల్లో రాజమండ్రి రూరల్ కూడా ఒకటి. ఇక్కడ ప్రస్తుతం టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఇక్కడనుండి జనసేన తరపున కందుల దుర్గేష్ పోటీచేసి సుమారు 20 వేల ఓట్లు తెచ్చుకున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీతో పొత్తుతో కచ్చితంగా దుర్గేష్ గెలుస్తారని పవన్ గట్టిగా నమ్ముతున్నారట.

అందుకనే దుర్గేష్ కు టికెట్ ఇప్పించాలని పవన్ డిసైడ్ అయినట్లు టీడీపీలోనే ప్రచారం జరుగుతోంది. దీంతో బుచ్చయ్యకు టికెట్ గల్లంతే అనే ప్రచారం పెరిగిపోతోంది. అదే నిజమైతే మరి బుచ్చయ్య ఏమి చేస్తారు..? అన్నదే ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. బుచ్చయ్య కన్ను ఎప్పటినుండో రాజమండ్రి అర్బన్ మీదుంది. కానీ, ఇక్కడున్నది ఆదిరెడ్డి భవాని. ఈమె ఎర్రన్నాయుడు కూతురు. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు చెల్లెలు. పైగా ఈమె మామ ఆదిరెడ్డి అప్పారావుకు టీడీపీలో మంచి పలుకుబడుంది. కాబట్టి ఆమెను కదల్చలేరు. అందుకనే బుచ్చయ్య టికెట్ కు జనసేన ఎసరుపెట్టేట్లుందనే ప్రచారం పెరిగిపోతోంది.

First Published:  20 Jan 2023 5:17 AM GMT
Next Story