Telugu Global
Andhra Pradesh

ఏపీ: జీఓ నె‍ంబర్ 1 ను ఈ నెల 23 వరకు సస్పెండ్ చేసిన‌ హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెంబర్ 1 ను రాష్ట్ర హైకోర్టు ఈ నెల 23 వరకు సస్పెండ్ చేసింది. ఈ జీవో ను సవాల్ చేస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఏపీ: జీఓ నె‍ంబర్ 1 ను ఈ నెల 23 వరకు సస్పెండ్ చేసిన‌ హైకోర్టు
X

రోడ్లమీద సభలను, రోడ్ షోలను నిషేధిస్తూ, సభలపై ఆంక్షలు విధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెంబర్ 1 ను రాష్ట్ర హైకోర్టు ఈ నెల 23 వరకు సస్పెండ్ చేసింది. ఈ జీవో ను సవాల్ చేస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 23 వరకు ఆ జీవోను సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.

నెల్లూరు జిల్లా కందుకూరులో, గుంటూరులో జరిగిన తెలుగు దేశం పార్టీ సభల్లో జరిగిన తొక్కిసలాటలలో 11 మంది మరణించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ జీవో తీసుక వచ్చింది.

జీవో వచ్చిన తర్వాత తెలుగుదేశం అధినేత చంద్రబాబు కుప్పం పర్యటించారు. అయితే ఈ జీ వో ఆధారంగా పోలీసులు ఆయనను అడుగడుగునా అడ్డుకున్నారు.

కాగా ఈ జీవో ప్రతిపక్షాల గొంతు నొక్కడానికే తీసుకవచ్చారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

First Published:  12 Jan 2023 11:01 AM GMT
Next Story